12/19/18 10:14 PM

రెచ్చిపోదాం బ్రదర్ అంటూ వెంకీ, వరుణ్ ఇరగదీశారు

F2 Movie First Song Released

టాలీవుడ్‌లో మరో ఇంట్రస్టింగ్ మల్టీస్టారర్ ఎఫ్-2. ఇందుకు కారణం విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్‌ వరుణ్ తేజ్. ఫన్ అండ్ ఫస్ట్రేషన్ అనేది ట్యాగ్ లైన్. తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ వంటి హ్యాట్రిక్ హిట్స్‌తో జోష్ మీదున్న అనిల్ రావిపూడి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాత. మొన్న రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తూ, అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇప్పుడు ఎఫ్2 నుండి ఫస్ట్‌ సాంగ్ టీజర్ వచ్చేసింది.

 

ఫస్ట్‌సాంగ్ టీజర్ సూపర్బ్‌గా ఉందనే రెస్పాన్స్ వచ్చింది. ఫారిన్‌లో బ్యూటిఫుల్ లొకేషన్లలో, అందాల భామలతో కలిసి వెంకీ, వరుణ్ చేసిన ఎంజాయ్ మామూలుగా లేదు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చెయ్యగా, కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా, డేవిడ్ సిమన్ అంతే బాగా పాడాడు. క్రికెట్ ఆడే బంతికి రెస్టే దొరికినట్టు ఉందిరో, 1947 అగస్ట్ 15ని నేడే చూసినట్టు ఉందిరో, రెచ్చిపోదాం బ్రదర్.. అంటూ సాగే ఎఫ్2 ఫస్ట్‌సాంగ్ టీజర్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. వెంకీ, వరుణ్‌లు తోడల్లుళ్ళుగా కనిపించబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఎఫ్2 రిలీజ్ చేయనున్నారు.

 

Tags : direcotr anil ravipudif2 movie first songVarun Tejvenkatesh

Also read

Use Facebook to Comment on this Post



Menu