09/18/18 10:14 PM

తెలుగు సినీ చరిత్రలో ఇదే తొలిసారి..

Untitled-1 copy

ఫిదా.. వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శతక్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన సినిమా.  గతేడాది రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.. అమెరికాలో పెరిగిన అబ్బాయిగా వరుణ్ తేజ్ .. తెలంగాణ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిగా సాయిపల్లవి ఈ సినిమాలో నటించారు. వైవిధ్యభరితమైన ఈ ప్రేమకథా చిత్రం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబట్టింది. కేవలం సినిమా మాత్రమే కాదు… యూట్యూబ్‌ లో ఈ మూవీ సాంగ్స్ కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

 

ఫిదాలోని…. “వచ్చిండే పిల్లా మెల్లగా వచ్చిండే..’ పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కేవలం ఒక్క యూట్యూబ్‌ లోనే ఇప్పటి వరకు 150 మిలియన్ల (15 కోట్లు) వ్యూస్ సొంతం చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ పాటకు ఇంత రెస్పాన్స్ రాలేదు. దీనికి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించగా…. మధుప్రియ, రాంకీ పాడారు. కార్తీక్ సంగీతం అందించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రాలలో ‘ఫిదా’ చెప్పుకోదగినదిగా నిలిచింది.

 

ఇప్పటికీ ఈ పాట స్టేజ్ షోలపైనా .. ఫంక్షన్స్ లోను వినిపిస్తూనే వుంది. యూట్యూబ్ లో ఈ పాటను ఇంతవరకూ 150 మిలియన్ల (15 కోట్లు) మందికి పైగా వీక్షించారంటూ, ఫేస్ బుక్ ద్వారా శేఖర్ కమ్ముల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘150 మిలియన్ మార్క్ ను దాటిన తొలి తెలుగు పాట ఇదే .. అద్భుతమైన మీ స్పందనకు ధన్యవాదాలు .. ఈ మ్యాజిక్ లో భాగమైన ‘ఫిదా’ టీమ్ కి శుభాకాంక్షలు’ అని ఆయన పోస్ట్ చేశారు.

Tags : Fidaa songmillion viewssai pallaviSensationalshekhar kammulaVarun Tej

Also read

Use Facebook to Comment on this Post



Menu