12/5/18 9:04 PM

ఎన్టీఆర్, మహేష్ బాబు కన్నా పవనే టాప్

Forbes List, Pawan Kalyan In Top

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. పోరాటయాత్ర పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. సినిమాలు పక్కన పెట్టి పాలిటిక్స్‌పైనే దృష్టి పెట్టారు. సినిమాలకు గుడ్‌బై చెప్పినా సంపాదనలో మాత్రం టాలీవుడ్ నుంచి పవనే టాప్‌లో ఉన్నారు. టాలీవుడ్ రిచెస్ట్ హీరోగా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రిన్స్ మహేష్ బాబును సైతం వెనక్కినెట్టేశారు. పవన్ సంపాదన రూ.31.33 కోట్లు. టాలీవుడ్ నుంచి చూసుకుంటే పవన్ కళ్యాణ్‌దే అత్యుత్తమ స్థానం. దక్షిణాది సినిమా హీరోల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ టాప్ ప్లేస్ లో ఉండగా.. ఆ తర్వాత పొజిషన్ పవన్ దే. టాలీవుడ్ నుంచి అత్యధికంగా సంపాదించిన హీరోల్లో పవన్ తర్వాత జూ.ఎన్టీఆర్ (28వ స్థానం) ఉన్నారు. ఆయన సంపాదన రూ.28 కోట్లు. ఎన్టీఆర్ తర్వాత రూ.24.33 కోట్ల ఇన్‌కమ్‌తో మహేష్‌బాబు 33వ స్థానంలో ఉన్నారు.

 

భారత్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ‘ఫోర్బ్స్ 2018 ఇండియా సెలబ్రిటీ 100’ జాబితాలో బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఆయన సంపాదన రూ. 253.25 కోట్లు. ఇక రూ.228.09 కోట్ల సంపాదనతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.

 

ఇక దక్షిణాది సినిమా హీరోల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మొత్తం జాబితాలో రజినీ 14 స్థానంలో ఉన్నా.. దక్షిణాది నుంచి ఆయనదే అత్యుత్తమ స్థానం. రజినీ సంపాదన రూ.50 కోట్లు. దక్షిణాది నుంచి రజినీ తరవాత పవన్ కళ్యాణ్ (24వ స్థానం) ఉన్నారు. పవన్ సంపాదన రూ.31.33 కోట్లు.

 

ఫోర్బ్స్ టాప్ 100 లిస్టులో ఇద్దరు సౌత్ హీరోయిన్లకు మాత్రమే చోటు దక్కింది. తాప్సీ రూ. 15.48 కోట్ల సంపాదనతో 67వ స్థానంలో, నయనతార రూ. 15.17 కోట్ల సంపాదనతో 69వ స్థానంలో ఉన్నారు. అయితే తాప్సీ సంపాదన అంతా కూడా బాలీవుడ్ సినిమాల ద్వారానే రావడం గమనార్హం.

 

టాప్ 100 లిస్టులో మెగా ఫ్యామిలీ హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్‌లకు చోటు దక్కకపోవడం విశేషం. అల్లు అర్జున్ రూ. 15.67 కోట్ల సంపాదనతో 64వ స్థానంలో, రామ్ చరణ్ రూ. 14 కోట్ల సంపాదనతో 72వ స్థానంలో ఉన్నారు.

 

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సైతం ఫోర్బ్స్ 100 లిస్టులో చోటు దక్కించుకున్నారు. విజయ్ దేవరకొండ రూ. 14 కోట్ల సంపాదనతో.. రాంచరణ్‌తో సమానంగా 72వ స్థానంలో ఉన్నారు. ఈ లిస్టులో కేవలం దర్శకుడు కొరటాల శివకు మాత్రమే చోటు దక్కింది. కొరటాల శివ రూ. 20 కోట్ల సంపాదనతో 39వ ప్లేస్‌లో ఉన్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నాగార్జున ఒక్కరే ఇందులో చోటు దక్కించుకున్నారు. నాగార్జున రూ. 22.25 కోట్ల సంపాదనతో 36వ స్థానంలో ఉన్నారు.

ఫోర్బ్స్ జాబితా.. టాలీవుడ్

1. పవన్ కళ్యాణ్ (24వ స్థానం) – రూ.31.33 కోట్లు
2. జూ. ఎన్టీఆర్ (28వ స్థానం) – రూ.28 కోట్లు
3. మహేష్‌బాబు (33వ స్థానం) – రూ.24.33 కోట్లు
4. నాగార్జున (36వ స్థానం) – రూ.22.25 కోట్లు
5. కొరటాల శివ (39వ స్థానం) – రూ.20 కోట్లు
6. అల్లు అర్జున్ (64వ స్థానం) – రూ.15.67 కోట్లు
7. రామ్ చరణ్ (72వ స్థానం) – రూ.14 కోట్లు
8. విజయ్ దేవరకొండ (72వ స్థానం) – రూ.14 కోట్లు

2017 అక్టోబర్ 1 నుంచి 2018 సెప్టెంబర్ 30 వరకు సెలబ్రిటీల సంపాదనను ఆధారంగా చేసుకుని ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది.

Tags : forbes india celebrity listforbes listJr.NTRmahesh baburajinikanthsalman khansouth indiatollywood richest hero pawan kalyantop earner

Also read

Use Facebook to Comment on this Post



Menu