10/8/18 9:25 PM

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చంద్రబాబు గుడ్ న్యూస్..!

aravinda sametha

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘అరవింద సమేత’. దసరా కానుకగా రిలీజ్ కానుంది. తమ అభిమాన నటుడి సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఎన్టీఆర్ తాజా చిత్రానికి స్పెషల్ షోలకు అనుమతి లభించింది. వారం రోజులపాటు అదనపు షోలు ప్రదర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రోజుకు ఆరు షోలను ప్రదర్శించుకునే అవకాశాన్ని థియేటర్లకు కల్పించింది. దీంతో ఏ ఇబ్బంది లేకుండా సినిమా చూడొచ్చని నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

 

అక్టోబర్ 11న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్‌ను అందుకుంది. ఆ వెంటనే అదనపు షోలకు పర్మిషన్ లభించింది. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే, ఈషా రెబ్బాలు హీరోయిన్లుగా నటించారు. జగపతి బాబు ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. నాగబాబు ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందించగా.. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు.

Tags : ap govt permissionAravinda samethagood news for ntr fansjrt ntrspecial showstrivikram

Also read

Use Facebook to Comment on this Post



Menu