01/1/19 8:48 PM

బాలయ్య బాబు అభిమానులకు గుడ్ న్యూస్

Good News For Nandamuri Balakrishna Fans

నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బాలయ్య నెక్ట్స్ మూవీ గురించి ఓ వార్త వచ్చింది. యువ దర్శకుడు, హ్యాట్రిక్ హిట్స్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా ఖరారైంది. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ కన్‌ఫర్మ్ చేశాడు. పటాస్‌తో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనిల్.. ఈ సినిమా తన సత్తా చూపించాడు. ఫ్లాప్స్‌లో ఉన్న కళ్యాణ్ రామ్‌కి బ్రేక్ ఇచ్చాడు. తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కంప్లీట్ చేశాడు. విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్‌ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన మల్టీస్టారర్ ఎఫ్2 మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో త్వరలో బాలకృష్ణతో సినిమా చెయ్యబోతున్నాని అనిల్ చెప్పాడు. ఈ చిత్రంలో బాలయ్యని మునుపెన్నడూ లేని విధంగా చూపిస్తానని చెప్పి అనిల్ రావిపూడి అప్పుడే అంచనాలు పెంచేశాడు.

 

గతంలో బాలయ్యకి ఓ స్ర్కిప్ట్‌ని అనిల్ వినిపించాడని వార్తలొచ్చాయి. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్‌‌కి కూడా అనిల్‌ని పిలిచాడు బాలయ్య. ఇప్పుడు స్వయంగా బాలయ్యతో సినిమా చేస్తానని అని ప్రకటించేశాడు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే బాలయ్య-అనిల్ రావిపూడి కాంబోలో సినిమా కన్ఫమ్ అనుకోవచ్చు. యువ దర్శకుడు అందునా హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన డైరెక్టర్‌తో బాలయ్య బాబు సినిమా రాబోందని తెలిసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

 

బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న విడుదల కానుంది. 11న రాంచరణ్ వినయ విధేయ రామ, జనవరి 12న వెంకీ-వరుణ్ మల్టీస్టారర్ ఎఫ్ 2 చిత్రం రిలీజ్ కానున్నాయి. దీంతో ఈసారి సంక్రాంతికి బాక్సాఫీస్ పోటీ రసవత్తరంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

Tags : balakrishna anil ravipudi moviedirector anil ravipudif2 moviegood news for balakrishna fansnandamuri balakrishna

Also read

Use Facebook to Comment on this Post



Menu