09/9/18 9:53 PM

అది నిజమైతే.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు పండుగే..!

Untitled-1 copy

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఇండస్ట్రీలో ఇప్పుడో న్యూస్ వైరల్ గా మారింది. అది నిజమే అయితే, పవన్ ఫ్యాన్స్ కు పండుగే అంటున్నారు. ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. పవన్ కల్యాణ్ మళ్లీ మేకప్ వేసుకుంటాడని, తెరపై కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

 

‘’అజ్ఞాతవాసి’’ సినిమా తర్వాత పవన్ నటనకు దూరమయ్యారు. ఫుల్ టైమ్ రాజకీయాలకే కేటాయించారు. దీంతో ఇక వెండితెర మీద పవన్ కనిపించటం అసాధ్యమన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తలు పవన్‌ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. పవన్‌ త్వరలో ఓ సినిమాలో నటించేందుకు సూచన ప్రాయంగా అంగీకరించారని సమాచారం.

 

పవన్‌ మేనల్లుడు, సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ త‍్వరలో హీరోగా పరిచయం అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. పవన్‌ తో ‘’గోపాల గోపాల’’, ‘’కాటమరాయుడు’’ సినిమాలను తెరకెక్కించిన డాలీ (కిశోర్‌ పార్థసాని) దర‍్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిస్తారట. ఈ సినిమాలో ఓ పవర్‌ ఫుల్‌ రోల్‌ కోసం పవన్‌ ను డాలీ సంప్రదించినట్టుగా వార్తలొస్తున్నాయి.

 

మేనల్లుడి కోసమనే కాకుండా దర్శకుడు డాలీ, నిర్మాత రామ్‌ తళ్లూరిలతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌ లో నటించేందుకు పవన్‌ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్‌ గాని, పవన్‌ సన్నిహితులు గాని ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

 

నిజంగానే పవన్ ఒప్పుకుంటే ఆయన మేనల్లుడికి ప్లస్ అవుతుందని అంతా భావిస్తున్నారు. చూడాలి మరి మేనల్లుడి కోసం పవన్ ఒప్పుకుంటాడో లేదో. ఒకవేళ ఓకే చెబితే మాత్రం ఫ్యాన్స్ కు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదేమో!

Tags : director dollyjanasenaMega heropawan kalyanpawan kalyan guest roelTollywoodVaishnav tej

Also read

Use Facebook to Comment on this Post



Menu