Ad

04/16/18 5:18 PM

ఆ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చ కోపంగా ఉన్నారు..!

Untitled-1 copy

భారతదేశంలో అన్ని చలనచిత్ర రికార్డులను బద్దలుకొట్టిన సినిమా ‘బాహుబలి-2’. ఈ సినిమా కోసం దాదాపు  నాలుగు సంవత్సరాల సమయాన్ని కేటాయించాడు హీరో ప్రభాస్. ప్రస్తుతం ‘సాహో’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సంవత్సరం నుండి ‘సాహో’ సినిమా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ‘బాహుబలి-2’ సినిమా తర్వాత విడుదలవుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులందరికీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి బాలీవుడ్ హక్కులు 120 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం.

 

‘బాహుబలి’ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ‘సాహో’ సినిమా విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాడు ప్రభాస్. ముఖ్యంగా లుక్ విషయంలో ఎక్కడా బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ తాజాగా ప్రభాస్ ఓ సినిమా ప్రమోషన్ కోసం.. ట్రైలర్ లాంఛింగ్ చేశాడు. ఈ సమయంలో కెమెరాకు దొరికిపోయాడు. ఈ పిక్స్ లో ప్రభాస్ లుక్ ఏ మాత్రం కొత్తగా లేదనే విషయం తెలిసిపోతోంది.

 

‘బాహుబలి’ గెటప్ తో పోల్చితే జుట్టు కొంచెం తగ్గించుకున్నాడు. బాడీ కూడా బాగా తగ్గింది. అంతే తప్ప.. తన లుక్ విషయంలో చేసిన మార్పులేమీ లేవు. మొత్తం మీద ప్రభాస్ లుక్ లో  పెద్ద తేడా ఏమీ కనబడలేదు. అయితే ఈ సినిమా రోజురోజుకు ఆలస్యం అవటంతో ప్రభాస్ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి కొంత అసహనం చెందుతున్నాడట. అలాగే భారీ హిట్టు కొట్టి కూడా ప్రభాస్ ఇంత గ్యాప్ తీసుకోవడం ఫ్యాన్స్ కు కూడా నచ్చటం లేదట.

Tags : bahubalibollywooddubhai.prabhasprabhas fans angryprabhas new looksaahoSahooSujeeth

Also read

Use Facebook to Comment on this Post



Menu