03/18/18 6:00 AM

ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి?

ugadi

ugadi-pachadi-recipe__1426848699_49.207.166.237

 

ప్రతి సంవత్సరం చైత్రశుద్ధపాడ్యమి నాడు తెలుగువారందరూ ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ ఉగాది.

 

ఉగస్యఆదిః ఉగాది. ఉగ అనగా నక్షత్రముల నడక అని అర్ధము. నక్షత్రములు నడకప్రారంభించిన కాలం యొక్కఆది …ఉగాది అయినది.

 

శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి, వేదములను దొంగిలించిన సోమకుని హరించి, ఆ వేదములను బ్రహ్మదేవునికి అప్పగించాడని పురాణగాధ. విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తినరోజు చైత్రశుద్ధ పాడ్యమి. దానిస్మృత్యర్ధం నాటి నుండి భక్తజనం అందరూ ఉగాది పండుగను జరుపుకొనుచున్నారని పురాణకథనం.

 

ఉగాది పండుగకు చారిత్రక ప్రాశస్త్యం కూడా ఉంది. విశ్వ విఖ్యాతిగాంచిన విక్రమార్క చక్రవర్తికి చైత్ర శుద్ధపాడ్యమినాడే పట్టాభిషేకం జరిగింది. దాని సంస్మరణార్ధం నాటినుండి ఉగాదివేడుకలు జరుపుకోవడం ఆచారంగా మారిందని చారిత్రకవృత్తాంతం.

 

ఉగాది పర్వదినాన మన దినచర్య ఎలా ఉండాలంటే..?

 

నూతన సంవత్సర కీర్తనాత్‌ ప్రారంభః ప్రతిగృహధ్వజారోహణం।

నింబపత్రాశనం సంవత్సర పంచాంగశ్రవణం నవరాత్రారంభః॥

నూతన సంవత్సరం మంచికీర్తనతో ప్రారంభమవ్వాలి. అభ్యంగన స్నానమాచరించి ఇష్టదైవాన్ని, నవగ్రహాది దిక్పాలకులను ప్రార్ధించాలి. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని ఉగాది పురుషుడి ప్రసాదంగా భావించి తినాలి. బంధుమిత్రులతో కలిసి భోజనం చేసిన పిమ్మట పంచాంగ శ్రవణంచేయాలి. ఉగాది నుండి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి.

ఉగాది పచ్చడి విషయానికి వస్తే దానిలో చాలా ఆరోగ్య రహస్యాలు అంతర్లీనంగా దాగున్నాయి.

అబ్దాదౌనింబ కుసుమంశర్కరామ్లఘృతైర్యుతమ్‌।

భక్షితం పూర్వయామేతు ప్రదదాతి సుఖంపరమ్‌॥

వేపపూవు, చింతపండు, బెల్లం, నెయ్యి, మిరియాలు, ఉప్పు, ఇలా షడ్రుచుల మిశ్రమం ఉగాది పచ్చడి. దీనిని ఆరగించుట వలన వాత కఫదోషాలు తొలుగునని, జీర్ణశక్తి, వీర్యవృద్ధి కలుగునని ఆయుర్వేదం తెలుపుతోంది. అంతేగాక జీవితంలో కష్టసుఖాలను, అన్నిరకాల భావోద్వేగాలను సమంగా స్వీకరించాలనే భావం ఉగాది పచ్చడిలో దాగుంది.

-పరమహంస

Tags : festivalHow to celebrate Ugadi festival ?PamchangampanchangamRasi PhalaluSri VilambiTelugu New Year Daytelugu peopleUGADIUgadi PacchadiUgadi Predictions

Also read

Use Facebook to Comment on this Post



Menu