07/13/18 7:55 PM

రామ్ చరణ్ ఆదేశాలతో వెనక్కితగ్గిన బోయపాటి..!

Untitled-1 copy

రంగస్థలం సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసినదే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతుంది. ఇదిలా వుండగా ఇటీవల చెర్రీ తన ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ నుండి టాక్. బోయపాటి సినిమా అంటేనే భారీ బడ్జెట్ తో ప్రేక్షకుడి కళ్ళను మైమరిపించే సెట్స్ తో ఉంటుందన్న విషయం తెలిసినదే.

 

అయితే తన సినిమా విషయంలో అటువంటివేమీ పెట్టుకోవద్దని బోయపాటికి సూచించాడట చెర్రీ. అంతేకాకుండా ముందు అనుకున్న బడ్జెట్ కంటే 10కోట్లు తక్కువకే చిత్రీకరణ పూర్తి చేయాలని బోయపాటికి చెర్రీ చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు మార్కెట్ ఉంది కదా అని ఖర్చు చేయించొద్దని, నిర్మాతకు లాభాలు రావాలని చెప్పడమే కాకుండా, ఎప్పటికప్పుడు ఖర్చు గురించి వివరాలను చెర్రీ తెలుసుకుంటున్నట్లు సమాచారం. దీంతో బోయపాటి కూడా తన భారీతనానికి కాస్త బ్రేక్ వేసినట్లు టాక్. దీంతో చెర్రీ తీసుకున్న నిర్ణయానికి సదరు సినిమా నిర్మాత కూడా చాలా సంతోషించాడు. ఎంతైనా ఓ నిర్మాత మనసు మరో నిర్మాతకి అర్థమవుతుంది….(ఇటీవల నిర్మాణ రంగంలో కూడా రామ్ చరణ్ అడుగుపెట్టాడు కదా) . ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా కి చెర్రీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Tags : boyapatiboyapati srimuchiranjeeviless expenditurelow budgetno budgetram charanRangasthalam

Also read

Use Facebook to Comment on this Post



Menu