01/29/19 12:56 PM

ఇది నిజమేనా ? ఇంతవరకూ చేయని పాత్రలో మాస్ మాహారాజా

Intersting News About Ravi Teja Disco Raja

ఏ హీరో చేయని సాహసం మాస్ మహారాజా రవితేజ చేస్తున్నాడా? ఇంతవరకు తన కెరీర్‌లో చేయని రోల్ ఇప్పుడు చేస్తున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ డైరెక్షన్‌లో ‘డిస్కో రాజా’ నిర్మితమవుతోంది. వీఐ ఆనంద్ సినిమాలు రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా ఉంటాయి. థ్రిల్లర్ నేపథ్యంలో సస్పెన్స్‌తో సాగుతుంటాయి. డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్‌ని త‌న క‌థాంశాలుగా ఎంచుకుని అటు విమ‌ర్శ‌కులు ఇటు ప్రేక్ష‌కుల‌ ఆద‌ర‌ణ అందుకుంటున్న క్రియేటివ్ డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్. రవితేజ సినిమా కూడా అదే తరహాలో కొనసాగనున్నట్టుగా ఫిల్మ్ నగర్‌ టాక్.

 

ఈ సినిమాలో కథ ఆరంభంలో రవితేజ వృద్ధుడిగా కనిపిస్తాడట. ఆ తర్వాత తన శత్రువులపై పగ తీర్చుకోవడం కోసం యువకుడిగా మారిపోతాడట. వృద్ధుడిగా వున్న ఆయన యువకుడిగా ఎలా మారిపోతాడనేదే సస్పెన్స్. ఇలా ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఉన్న కారణంగానే ఈ సినిమా చేయడానికి వెంటనే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీగా ఈ కథ సాగుతుందని చెబుతున్నారు. వరుస పరాజయాలతో వున్న రవితేజ, ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.

 

ఎస్ఆర్‌టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ ఎన‌ర్జీకి స‌రిపోయే విధంగా ఈ సినిమాకు ‘డిస్కో రాజా’ అనే టైటిల్ని ఖ‌రారు చేశారు. జ‌న‌వ‌రి 26 రిప‌బ్లిక్ డే తో పాటు ర‌వితేజ పుట్టిన రోజు సంద‌ర్భంగా డిస్కోరాజా టైటిల్ లోగోని విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే.

Tags : disco rajaMass maharajaold personRavi tejaravi teja new rolevi anand

Also read

Use Facebook to Comment on this Post



Menu