05/18/19 9:05 AM

ఎన్టీఆర్ నిర్ణయంతో నిరాశలో అభిమానులు

Jr NTR Disappoint Fans

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అభిమానులు ఊహించని విధంగా డెసిసన్ తీసుకున్నారు. ఈసారి బర్త్ డే వేడుకలకు తారక్ దూరంగా ఉండనున్నారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం లేదు. మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ప్రతి ఏడాది అభిమానులు ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది తన పుట్టిన రోజు వేడుకలకు ఎటువంటి హడావిడి చేయవద్దని జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను కోరారు. దీనికి కారణం లేకపోలేదు.

 

జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చనిపోయి ఏడాది కూడా పూర్తికాలేదు. ఈ విషాద ఘటన నుంచి తాను ఇంకా తేరుకోలేదని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించవద్దని, ఆ రోజు పేదలకు ఉపయోగపడే పనులు మాత్రమే చేయాలని ఆయన తన అభిమానులను కోరారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు చేసుకోవ‌డం లేద‌ని తెలిసి ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే కార‌ణం తెలిసి కాంప్ర‌మైజ్ అయ్యారు.

 

గతేడాది ఆగస్టు 29న నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ తండ్రి, నటుడు నందమూరి హరికృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ షాక్ నుంచి హరికృష్ణ కుటుంబసభ్యులు ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌలి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ఎన్టీఆర్ బ‌ర్త్ డే త‌ర్వాతి రోజు.. అంటే మే 21 నుంచి ప్రారంభం కానుంది. గాయం నుంచి కోలుకున్న రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు.

Tags : awaybirthday celebrationsfanshari krishna deathJr.NTR

Also read

Use Facebook to Comment on this Post



Menu