05/6/19 8:17 PM

అభిమాని మరణం : తీవ్ర ఆవేదనలో జూ.ఎన్టీఆర్

Jr NTR Express Condolence For His Fan Death

హీరోలకు అభిమానులు ఉండటం సహజం. తమ అభిమాన నటుల కోసం ప్రాణం ఇచ్చే పిచ్చి ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఇందులో పెద్ద విశేషం లేదు. కానీ.. అభిమానులను అభిమానించే హీరోలు ఉండటం విశేషమే కదా. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని విషయంలో ఇదే జరిగింది. జయదేవ్ అనే వ్యక్తి తారక్ కు పెద్ద ఫ్యాన్. రీసెంట్ గా ఆయన చనిపోయారు. దీంతో ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనకు అత్యంత ఆప్తుడు, అభిమాని జయదేవ్ చనిపోయారన్న వార్త తెలసి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కృష్ణ జిల్లా అభిమాని సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరు అన్న వార్త ఎన్టీఆర్‌ను తీవ్ర ఆవేదనను గురిచేసింది. ఈ నేపథ్యంలో తారక్ ఆయనకు సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జయదేవ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

 

హీరోగా తన తొలి సినిమా ‘నిన్ను చూడాలని’ నుంచి రీసెంట్‌గా విడుదలైన ‘అరవింద సమేత వీర రాఘవ’ వరకు నా ప్రతి మజిలీలో జయదేవ్‌ తనకు తోడుగా ఉన్నాడని ఎన్టీఆర్ అన్నారు. జయదేవ్ లేని లోటు తీరనది. నేను వేసిన తొలి అడుగు నుండి నేటి వరకు నాకు తోడు నీడగా ఉన్న వారిలో జయదేవ్ చాలా ముఖ్యమైన వారు. ఆయన లేని లోటు నాకు పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.. అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు జయదేవ్‌తో దిగిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. జయదేవ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎన్టీఆర్ పెట్టి ట్వీట్ ఫ్యాన్స్ హృదయాలను తాకింది. వారు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.

Tags : jayadevjr ntr fan deathjr ntr tweetJr.NTR

Also read

Use Facebook to Comment on this Post



Menu