10/21/18 9:16 PM

మళ్లీ ఒక్కటైన నందమూరి హీరోలు..!

jr ntr thanks to balakrishna

నందమూరి అభిమానుల ఆశలు నెరవేరాయి. అభిమానులంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఘట్టం ఆవిష్కృతమైంది. నందమూరి స్టార్ హీరోలు బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించి ఫ్యాన్స్ కు కనువిందు చేశారు. చాలా రోజుల తర్వాత బాబాయ్, అబ్బాయ్ లు ఒకే వేదికపై కనిపించి తమ మధ్య గ్యాప్ ఉందనే వార్తలకు చెక్ చెప్పారు.

jr ntr with balakrishna

ఆదివారం సాయంత్రం హైదరాబాద్ శిల్పాకళా వేదికలో అరవింద సమేత సక్సెస్ మీట్‌కు హీరో బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణం తరువాత జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ మళ్లీ దగ్గరవుతారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా అరవింద సమేత సక్సెస్ మీట్‌కు బాలకృష్ణ రావడంతో ఈ వార్తలు వాస్తవం అయ్యాయి.

ntr balakrishna

సక్సెస్ మీట్ సందర్బంగా మాట్లాడిన తారక్.. బాబాయ్ బాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపాడు. ‘’నాన్న లేకపోయినా తండ్రి హోదాలో ఇక్కడికి వచ్చిన బాబాయ్ బాలయ్యకి నా హృదయపూర్వక పాదాభివందనాలు. బాబాయ్ థ్యాంక్స్ ఏ లాట్. మా విజయానికి మీ ఆశీస్సులు అందించినందుకు మరోసారి ధన్యవాదాలు’’ అంటూ ఎన్టీఆర్ స్పీచ్ సాగింది. అబ్బాయ్ నోట బాబాయ్ అనే మాట వినిపించగానే హాల్ మొత్తం అభిమానుల కేరింతలతో మార్మోగింది. జోహార్ ఎన్టీఆర్ జై ఎన్టీఆర్.. జోహార్ హరికృష్ణ జై హరికష్ణ అంటూ ఎన్టీఆర్ తన స్పీచ్ ముగించాడు.

 

కాగా ఈ వేదికపై తారక్ మరోసారి తన తండ్రి హరికృష్ణను గుర్తు చేసుకుని ఎమోషన్ అయ్యాడు. నాన్న లేకపోవడం బాధాకరం అన్నాడు. ఈ సమయంలో నాన్న ఉండి ఉంటే బ్రహ్మాండంగా ఉండేదన్న ఎన్టీఆర్.. ఆయన ఇక్కడే ఎక్కడో ఉండి అంతా చూస్తుంటారని చెప్పాడు.

 

డైరెక్టర్ త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పాడు. అంతేకాదు ప్రశంసలతో ముంచెత్తాడు. నాన్న కోల్పోయిన బాధలో ఉన్న తన  కుటుంబంలో కొత్త వెలుగు ఇచ్చావన్నారు. అరవింత సమేత ద్వారా తన జీవితంలో మర్చిపోలేని చిత్రాన్ని ఇచ్చావన్నారు. తనకు మంచి సినిమా ఇచ్చినందుకు త్రివిక్రమ్ కు థ్యాంక్స్ చెప్పాడు ఎన్టీఆర్. ఎప్పటిలాగే ప్రేక్షక దేవుళ్లకు కూడా కృతజ్ఞతలు తెలిపాడు ఎన్టీఆర్.

jr ntr balakrishna ntr balayya

 

tarak tarak with balayya

Tags : aravinda sametha success meetchandrababu naidujr ntr balakrishnajr ntr election campaignJr.NTRnandamuri balakrishnantr thanks to balakrishnapawan kalyanTDPtrivikram

Also read

Use Facebook to Comment on this Post



Menu