08/11/19 10:14 PM

కాజల్.. ఇలాంటి సీన్లతో సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దామని

Kajal Agarwal Movie In Controversy

టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ నటించిన తొలి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం ప్యారిస్‌ ప్యారిస్‌. ఇది హిందీలో సంచలన విజయాన్ని సాధించిన క్వీన్‌ చిత్రానికి రీమేక్‌. ఎందరో ప్రముఖ నటీమణులు నటించాలని ఆశపడ్డ ఈ చిత్రంలోని కథానాయకి పాత్రను పోషించే అవకాశం నటి కాజల్‌ అగర్వాల్‌కు దక్కింది. ఇదే చిత్రం తెలుగులో నటి తమన్నా హీరోయిన్‌గా దటీజ్‌ మహాలక్ష్మి పేరుతో తెరకెక్కింది. ఇక కన్నడంలో పరూల్‌మాధవ్‌ హీరోయిన్‌గా బటర్‌ ఫ్లై పేరుతోనూ, మలయాళంలో మంజిమామోహన్‌ హీరోయిన్‌గా జామ్‌జామ్‌ పేరుతోనూ రూపొందింది. అయితే వాటితో పోలిస్తే కాజల్ సినిమాకే ఎక్కువ క్రేజ్ వచ్చింది. దీని టీజర్ కు యూట్యూబ్ లో వచ్చిన వ్యూస్ తో పోలిస్తే.. మిగతా మూడు వెర్షన్ల వ్యూస్ సమానంగా ఉండటం విశేషం. ఇందుకు టీజర్ లో కాజల్ చేసిన బోల్డ్ యాక్టింగే కారణం.

 

‘క్వీన్’ రీమేక్ వెర్షన్లు నాలుగింటినీ ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్. అందుకోసం వేర్వేరు భాషల్లో సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్లారు. అయితే మిగతా మూడు భాషల్లో ఈజీగా సెన్సార్ అయిపోయింది. సర్టిఫికెట్ ఇచ్చేశారు. కానీ తమిళ వెర్షన్ దగ్గరే ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని సన్నివేశాలు, డైలాగుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 25 వరకూ ఆడియో, వీడియో కట్స్‌ను ఇచ్చారు. సెన్సార్ బోర్డు చెప్పినట్లు కోతలు వేయడానికి చిత్ర బృందం మాత్రం అంగీకరించడం లేదు. రివైజింగ్ కమిటీకి వెళ్లి సర్టిఫికెట్ తెచ్చుకోవాలని దర్శక నిర్మాతలు ఫిక్సయ్యారు.

 

‘ప్యారిస్ ప్యారిస్’లో బోల్డ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతులు ఉన్నాయని టీజర్ చూస్తేనే అందరికీ అర్థమైంది. అంతేకాదు, టీజర్‌లో కాజల్‌ బ్రెస్ట్‌ని మరో నటి ప్రెస్ చేయడం అప్పట్లో సంచలనమైంది. ఇందులో అలాంటి సీన్స్ ఇంకా ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు కట్స్ రావడంతో ఇది నిజమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిగిలిన అన్ని భాషల్లో మామూలుగా తెరకెక్కించినా.. కాజల్ నటిస్తున్న సినిమాలోనే ఎందుకు అలాంటి సీన్స్ పెట్టారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో మరి. కానీ కలెక్షన్ల కోసం కాసుల కోసం మరీ ఇంతకు దిగజారాలా అని కొందరు ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. మరీ ఇంత బోల్డ్ సీన్లు, రొమాన్స్ అవసరమా అని అడుగుతున్నారు. కాజల్.. సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇద్దామని అనుకున్నావు అని నిలదీస్తున్నారు. అంతేకాదు.. తమిళ సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని కొందరు ప్రేక్షకులు సమర్థిస్తున్నారు. 25 వీడియో కట్స్ కరెక్ట్ నిర్ణయమే అంటున్నారు. 25 కాదు కట్స్ కాదు.. ఏకంగా సినిమానే బ్యాన్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి సినిమాల కారణంగా యువత చెడిపోయే ప్రమాదం ఉందన్నారు.

Tags : bold scenesbollywoodKajal AgarwalKanganaparis parisqueenromancetamil

Also read

Use Facebook to Comment on this PostMenu