07/13/18 4:00 PM

‘చినబాబు’ మూవీ రివ్యూ!

chinababu review

‘చినబాబు’ మూవీ రివ్యూ

 

రిలీజ్ డేట్‌ః జూలై 13, 2018

నటీనటులు : కార్తీ, సాయేషా సైగల్‌, సత్యరాజ్‌, భానుప్రియ తదితరులు

దర్శకత్వం : పాండిరాజ్

నిర్మాత : సూర్య

సంగీతం : డి.ఇమాన్

సినిమాటోగ్రఫర్ : వేల్ రాజ్

ఎడిటర్ : రుబెన్

కథః

 

ఐదుగురు కూతుళ్లున్న రుద్రరాజు (సత్యరాజ్‌)  కు ఏకైక మగ సంతానం కృష్ణంరాజు అకా చినబాబు (కార్తి).   ఐదుగురు అక్కలకు తమ్ముడు కావడం.. ఆ ఇంటికి ఏకైక వారసుడిగా కావడంతో.. ఇంటిల్లపాది అతడిని గారాబంగా పెంచుతారు.  పెద్దయ్యాక కూడా ఊర్లోనే ఉంటూ సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటూ ఉత్తమ రైతుగా అవార్డులు తెచ్చుకుని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటాడు చినబాబు. రుద్రరాజు  ఐదుగురు కూతుళ్లలో.. ఇద్దరు కూతుళ్లు చినబాబు (కార్తి) ని తమ కూతుళ్ల కిచ్చి పెళ్లి  చేయాలనే ఆలోచనతో  ఎప్పుడూ తగువులాడుకుంటుంటారు. అయితే సీన్‌లోకి నీల నీరద (సాయేషా సైగల్ ) ఎంటర్ అయ్యాక ఆమెతో లవ్‌లో పడతాడు కృష్ణంరాజు.  అదే ఊర్లో ఉండే నీలనీరద బావ సురేందర్ రాజుకు కృష్ణంరాజు (కార్తి) అంటే పడదు. దీంతో తన మరదలును ప్రేమిస్తున్నందకు అతడిపై మరింత పగను పెంచుకుని చినబాబు(కార్తి) ఇంట్లో చిచ్చుపెడతాడు. మరో వైపు, మేన‌కోడ‌లు రాధిక కూడా తనను  పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని కృష్ణంరాజు(చినబాబు)ని బెదిరిస్తోంది. ఈ క్రమంలో అక్క‌లు బయటి అమ్మాయిని చేసుకుంటున్నందుకు చినబాబుతో గొడవ పడతారు. దీంతో, విచ్చిన్నమైన కుటుంబాన్ని చినబాబు ఎలా కలిపాడు..తన అక్కలను.. మేనకోడళ్లను ఎలా దారిలో పెట్టి.. ఆ తర్వాత కుటుంబంలో తలెత్తిన సమస్యలను కృష్ణంరాజు పరిష్కరించి.. ఎలా  నీలనీరద(సాయేషా సైగల్‌) పెళ్లి చేసుకున్నాడన్నదే మిగతా కథ!

 

ఫెర్‌ఫార్మెన్స్‌స్‌ః 

పల్లెటూరి కుర్రాడి పాత్రలో అత్యంత సహజంగా నటించాడు కార్తీ. అచ్చం ఓ రైతులాగానే తన ఆహార్యాన్ని మార్చుకుని పాత్రకు అతడు ప్రాణం పోశాడు. హీరోయిన్‌గా నటించిన సయేషా సైగల్‌ అమాయకపు పల్లెటూరి అమ్మాయిగా.. గోలీసోడా కంపెనీ ఓనర్‌ గా అలరించింది. ఇక మగపిల్లవాడి కోసం  తపించే సగటు పల్లెటూరి బైతు పాత్రలో సత్యరాజ్‌ మెప్పించాడు. ఆయన పాత్ర ను ఇటు కామెడీ.. మరో వైపు ఎమోషనల్‌గా దర్శకుడు తీర్చిదిద్దాడు. ఇక, కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో సీనియర్ నటి భానుప్రియ మెప్పించింది

 

ఎనాలిసిస్‌:

సినిమా అర్థబాగాన్ని  ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌లో.. అలరించే చక్కటి కామెడీ సన్నివేశాలతో ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించిన దర్శకుడు రెండో అర్థభాగాన్ని ఎక్కువ మెలోడ్రామాతో.. సెంటిమెంట్‌తో నింపేశాడు. దీంతో ప్రేక్షకులకు సెకండాఫ్‌ కాస్త బోర్‌ కొట్టవచ్చు. ఉమ్మడి కుటుంబాల్లో ఎలాంటి సమస్యల్లుంటాయో, ఒక్కోసారి చిన్న చిన్న గొడవలే చినికి చినికిగాలివానలా మారిపోయి అనుబంధాలను- బంధాలను ఎంత దారుణంగా విడిదీస్తాయో అత్యంత సహజంగా దర్శకుడు పాండిరాజ్‌ చూపించాడు. అయితే వీటిని బాగా డ్రాగ్‌ చేయడంతో ప్రేక్షకులకి కాస్త విసుగు కలుగుతుంది. సినిమాలో ఎక్కువ తమిళ్ ప్లేవర్ కనిపించడం కూడా ఓ మైనస్సే! ఇలాంటి స్టోరీలతో 80,90లలో చాలా తెలుగు సినిమాలు వచ్చాయి. కాబట్టి, కథాపరంగా తెలుగు ప్రేక్షకులకు కొత్తదనం ఏమీ కనిపించకపోవచ్చు. అయితే కథ పాతదే అయినప్పటికీ తనదైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులని ఆకట్టుకునేడట్లు చేయడంలో దర్శకుడు పాండిరాజ్ కొంత మేర సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

పాజిటివ్ పాయింట్స్‌ః

ఫస్ట్ హాఫ్‌

కామెడీ

ఎమోషన్స్‌

 

నెగటివ్ పాయింట్స్‌ః

పాత కథే

మ్యూజిక్‌

సెకండాఫ్‌ లో మెలో డ్రామా

 

పంచ్‌లైన్‌ః   పక్కా బీ, సీ సెంటర్ల సినిమా

రేటింగ్‌ః 3/5

Tags : Chinna babu movie reviewKarthis chinna babu review

Use Facebook to Comment on this PostMenu