08/13/19 1:31 PM

సంపూనా మజాకా : అగ్ర హీరోలనే బీట్ చేశాడు

Kobbari Matta Movie Record Collections

సంపూర్ణేష్ బాబు… హృదయ కాలేయం సినిమాతో బర్నింగ్ స్టార్‌గా తెలుగు తెరకు పరిచయమైన ఈ నటుడు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ సంచనలంగా మారాడు. కమెడియనే కదా అని సింపుల్ గా తీసిపారేయడానికి వీలు లేకుండా చేశాడు. తనదైన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, కామెడీతో కేక పెట్టిస్తున్నాడు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. దర్శక, నిర్మాతల్లో ఆనందం నింపుతున్నాడు.

 

ఎన్నో అవాంతరాల తర్వాత సంపూ నటించిన కొబ్బరి మట్ట చిత్రం ఎట్టకేలకు ఆగస్టు 9న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి డైరెక్టర్ రూపక్ రొనాల్డ్ సన్. సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యంలో ‘హృద‌య‌ కాలేయం’ సృష్టిక‌ర్త స్టీవెన్ శంక‌ర్ అందించిన క‌థ‌, క‌థ‌నంతో కొబ్బరి మట్ట సినిమా తీశారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. బడ్జెట్ సమస్యల కారణంగా సినిమాకి సరైన ప్రమోషన్ చేయలేకపోయినా.. మౌత్ టాక్‌తో మూవీ మంచి కలెక్షన్లు రాబడుతోంది. కలెక్షన్ల విషయంలో సంపూర్ణేష్ బాబు స్టార్ హీరోలను వెనక్కి నెట్టి మరీ తన సత్తా చాటాడు.

 

కొబ్బరి మట్ట మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. సంపూ కామెడీని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. నిజానికి ఈ సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయోనని దర్శక, నిర్మాతలు కాస్త టెన్షన్ పడ్డా.. జనాల రియాక్షన్ చూశాక హ్యాపీగా ఫీలవుతున్నారు. సంపూ కలెక్షన్స్ స్టామినాకు ఆశ్చర్యపోతున్నారు. విశేషమేంటంటే.. నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాల కలెక్షన్లను సైతం సంపూ బీట్ చేస్తుండటంతో నిర్మాతలు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 

కొబ్బరి మట్ట సినిమా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రూ.2,88,111 గ్రాస్ వసూలు చేసింది. నాగార్జున నటించిన మన్మథుడు 2, బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు లాంటి సినిమాల ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ల కంటే ఇది ఎక్కువ కావడం విశేషం. ఆర్టీస్ క్రాస్ రోడ్స్‌లో మన్మథుడు డే-1 గ్రాస్ కలెక్షన్స్ రూ.2,83,950 కాగా.. ఎన్టీఆర్ మహానాయకుడు గ్రాస్ కలెక్షన్స్ రూ.1,60,641. కొబ్బరిమట్టతో సంపూ ఈ కలెక్షన్లను బీట్ చేశాడు. శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో సంపూ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.60లక్షల నుంచి రూ.65లక్షలు షేర్ రాబట్టినట్టు చెబుతున్నారు. మొదటిరోజు మొత్తంగా రూ.62లక్షలు షేర్ వసూలు చేసినట్టు టాక్. మరి లాంగ్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి. ఈ లెక్కన చూసుకుంటే సంపూ.. సీనియర్ హీరోలను మించిపోయాడని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. టాలెంట్ ఉండాలే కానీ.. ఎవరు యాక్ట్ చేసినా సినిమా సక్సెస్ అవుతుందని చెప్పడానికి సంపూనే నిదర్శనం అంటున్నారు అభిమానులు.

Tags : balakrishnabox office collectionskobbari mattanagarjunarecordrtr x roadsSampoornesh babu

Also read

Use Facebook to Comment on this Post



Menu