01/16/19 7:14 PM

కథానాయకుడు కలెక్షన్లు : బాలయ్యకు షాక్

NTR Kathanayakudu Movie Collections

నందమూరి బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కథానాయకుడు’. దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా, ఎన్టీఆర్ సినీ ప్రస్థానానికి సంబంధించిన విశేషాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 9వ తేదీన భారీ స్థాయిలో విడుదలైంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి వారం రోజులు దాటింది. వెయ్యి థియేటర్లకుపైగా ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో ఈ సినిమా 15.5 కోట్ల షేర్‌ను మాత్రమే వసూలు చేసింది. గ్రాస్ పరంగా చూస్తే 28.4కోట్లు వచ్చాయి. భారీ అంచనాలతో సంక్రాంతి బరిలోకి ముందుగా దిగిన ఈ సినిమా, ఆశించిన స్థాయి వసూళ్లను అందుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. కథానాయకుడు కలెక్షన్లు చిత్రయూనిట్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి. ఇక ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగంగా ‘మహానాయకుడు’ కూడా చాలా వరకూ షూటింగ్ జరుపుకుంది. తదుపరి షెడ్యూల్‌ను ఈ శనివారం నుంచి ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన విశేషాలతో ‘మహానాయకుడు’ తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

 

collections

సంక్రాంతి కానుకగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, రజనీకాంత్ పేట, రాంచరణ్ వినయ విథేయ రామ, వెంకీ, వరుణ్ తేజ్ మల్టీస్టార్ ఎఫ్ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో సంక్రాంతి బరిలో విజయం సాధించిన మూవీ ఎఫ్2 మాత్రమే.

Tags : bad talkbalakrishnabiopicbox office collectionsdisasterkrishntr kathanayakudupoor collections

Also read

Use Facebook to Comment on this Post



Menu