03/14/19 1:05 PM

లక్ష్మీపార్వతి దేవత, బాబు దెయ్యమా : సినిమా ఆపేయాలని ఫిర్యాదు

Lakshmis NTR Movie Controversy, TDP Compalint TO EC

దివంగత ఎన్టీ రామారావు బయోపిక్ కు పోటీగా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కించారు. లక్ష్మీపార్వతి కోణంలో ఎన్టీఆర్ జీవితంపై ఆయన సినిమా తీశారు. ఈ మూవీ పేరు ప్రకటించినప్పట్టి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి ట్రైలర్, సాంగ్స్ అన్నీ సంచలనమే. ‘వెన్నుపోటు’ అంటూ వర్మ చేసిన ప్రచారం సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన ఈ సినిమాలో లక్ష్మీపార్వతిని దేవతగా చూపిస్తూ.. చంద్రబాబుని విలన్ లా మార్చేశారని వర్మపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో చంద్రబాబుని విలన్ లా చూపించారని, ఎన్నికల తరుణంలో ఇలాంటి సినిమా వస్తే టీడీపీ రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపుతుందని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. సినిమా రిలీజ్ అడ్డుకునేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

 

వాస్తవానికి ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఈ వెన్నుపోటు ఎపిసోడ్ అందరికి ఆసక్తి. అందుకే దీన్నే ప్రధాన కథాంశంగా వర్మ తీసుకున్నాడు. సినిమాను విజయవంతంగా పూర్తి చేసి మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సినిమా విడుదలను తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రిలీజ్ కాకుండా ఆపేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది.

 

టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని వర్మ తెలిపాడు. ఈ సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు పాత్రను నెగెటివ్‌గా చూపించారని, ఈ సినిమా ఓటర్లపై ప్రభావం చూపుతుందని చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారట. తొలి విడత పోలింగ్ పూర్తయ్యే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని కోరారట.

 

అయితే, ఇలాంటి ఫిర్యాదులు నిజాన్ని ఆపలేవని వర్మ అంటున్నారు. థియేటర్ లో రిలీజ్ అడ్డుకుంటే సినిమాను డైరెక్ట్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తానని వర్మ చెప్పుకొచ్చాడు. టీడీపీ బెదిరింపులకు భయపడేది లేదని, సినిమా తప్పకుండా రిలీజ్ అవుతుందని ఆర్జీవీ అంటున్నారు. మరి వర్మ చెప్పినట్టుగా మార్చి 22నే లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ చేస్తాడా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

Tags : chandrababuLAKSHMI PARVATHIlakshmis ntrNT Ramaraoram gopal varmaTDPvennupotu

Also read

Use Facebook to Comment on this Post



Menu