03/31/19 9:53 PM

లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ విషయంలో పట్టువదలని వర్మ

lakshmis ntr release, ram gopal varma to approach supreme court

అసలే రాంగోపాల్ వర్మ.. తాను చెప్పాలనుకున్నది, చెయ్యాలనుకున్నది చేసే రకం. పట్టుబడితే అస్సలు వదలడు. ఆరు నూరైనా అనుకున్నది సాధిస్తాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో వర్మ పట్టుదల ఏంటో చూపించాడు. తాజాగా వర్మ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను అడ్డుకోవడంపై వర్మ సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు. లాయర్స్ అందరూ వర్కింగ్ ఔట్‌లో ఉండటం వల్ల.. సోమవారం సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తున్నామని చెప్పాడు. సుప్రీంకోర్టులో తీర్పు తనకి అనుకూలంగా వస్తుందని, ఏపీలోనూ సినిమా రిలీజ్ అవుతుందని వర్మ ధీమాగా చెప్పాడు. అమరావతి కోర్టు మార్చి 3న సినిమాను చూపించి ఆ తర్వాత విడుదల చేసుకోమని చెప్పిందని.. ఇంతలో మంగళగిరి కోర్టులో మరో కేసు వేశారని వర్మ చెప్పారు. ఇలా ఎన్ని కేసులు వేసినా సినిమాను అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా.. చూడాలని ప్రేక్షకులకు ఉంటే ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి సినిమా చూస్తారని వర్మ చెప్పుకొచ్చాడు.

 

వర్మ వివాదాస్పద మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఏపీలో తప్ప ప్రపంచం మొత్తం విడుదలైంది. అయితే తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ కంటే.. ఏపీ ప్రజలే ఎక్కువగా ఈ సినిమా చేశారంటూ తనదైన శైలిలో స్పందించాడు వర్మ. ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీతో ప్రపంచంలో ఎక్కడ ఏ మూల సినిమా విడుదల చేసినా నిమిషాల వ్యవధిలో చూడాలనుకున్న వాళ్లు చూడొచ్చని వర్మ చెప్పాడు. అది లీగల్ కావచ్చు అన్ లీగల్ కావచ్చు.. ఒక సినిమాను ఆ ప్రాంతంలో విడుదల కాకుండా ఆపేస్తే చూడలేరనుకోవడం భ్రమ అని అన్నారు. మహా అయితే నిర్మాతలకు నష్టం రావచ్చొన్నారు. కానీ ఆడియన్స్ చూడాలనుకుంటే సినిమా దొరక్కపోవడం అంటూ జరగదన్నారు. నా ఫీలింగ్ ఏంటంటే తెలంగాణ కంటే ఆంధ్రావాళ్లే ఎక్కవ మంది ఈ సినిమా చూసి ఉంటారని అని చెప్పుకొచ్చాడు. సినిమాని చూసిన ప్రేక్షకులు నిజాలను చూపించామని నమ్ముతున్నారని, అందుకు ఈ చిత్రానికి మంచి స్పందనతో పాటు కలెక్షన్లు వస్తున్నాయని వర్మ గొప్పగా చెప్పుకున్నాడు.

 

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన దగ్గర నుంచి జరిగిన సంఘటనల సమాహారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను వర్మ రూపొందించాడు. వెన్నుపోటు ప్రధాన అంశం చేసుకుని సినిమాను తెరకెక్కించాడు. చంద్రబాబుని విలన్ లా, లక్ష్మీపార్వతిని దేవతలా చూపించాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ‘కుటుంబ కుట్రల చిత్రం’ అనే ట్యాగ్ లైన్ .. అసలైన కథ ఇదేనంటూ చేసిన ప్రచారం ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఏపీ హైకోర్టు ఈ సినిమా రిలీజ్ పై స్టే ఇవ్వడంతో అక్కడ మినహా ఈ సినిమా మిగతా ప్రాంతాల్లో శుక్రవారం(మార్చి 29) విడుదలైంది. తెలంగాణలోను .. ఓవర్సీస్ లోను ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. ఫస్ట్ డే ఈ సినిమా 4 కోట్ల గ్రాస్ ను సాధించినట్టుగా చెబుతున్నారు.

Tags : lakshmis ntrlakshmis ntr box office collectionsram gopal varmaRGVsupreme court

Also read

Use Facebook to Comment on this PostMenu