04/27/19 9:37 PM

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు లైన్ క్లియర్ : కానీ ఏం లాభం?

Lakshmi NTR To Release In AP

లక్ష్మీపార్వతి కోణం ఎన్టీఆర్ జీవితం ఆధారంగా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇందులో లక్ష్మీపార్వతిని దేవతలా, చంద్రబాబుని విలన్ లా వర్మ చూపించాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలను కోర్టు అడ్డుకున్న విషయం తెలిసిందే. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఏపీలో మే 1వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మేరకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఎట్టకేలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మే 1న ఆంధ్రప్రదేశ్ లో విడుదల కానుందని, ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలను వచ్చి చూడండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ‘యన్.టి.ఆర్. అనుభవించిన నరకం!’ అంటూ పోస్ట్ చేసిన పోస్టర్ పై ఎన్టీఆర్, చంద్రబాబు పాత్రధారులు ఉన్నారు.

 

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను మార్చి 29న తెలుగు దేశం వ్యవస్థాపక దినోత్సవం రోజున ఏపీలో కాకుండా తెలంగాణతో పాటు ఓవర్సీస్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 1989లో ఎన్టీఆర్ ఓటమిపాలైన అనంతరం.. లక్ష్మీపార్వతి అన్నగారి జీవితంలో ప్రవేశించడం, ఆ తర్వాత జరిగిన సంఘటన నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించాడు వర్మ. వర్మ తనదైన కోణంలో చంద్రబాబు పాత్రను విలన్‌గా చిత్రీకరించి.. లక్ష్మీ పార్వతిపాత్రను ఉదాత్తమైనదిగా ఈ సినిమాలో చూపించడం కొంత మందికి నచ్చకపోయినా ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది.

 

ఈ సినిమాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును విలన్‌గా చిత్రీకరించారని, ఇది ఎన్నికల్లో టీడీపీపై ప్రభావం చూపుతుందని.. టీడీపీ నేతలు ఆరోపించడంతో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసేంతవరకు ఏపీలో రిలీజ్ చేయెద్దని హైకోర్టు ఆర్డర్ వేసిన సంగతి తెలిసిందే. కోర్టు స్టేలు.. తెలుగు తమ్ముళ్ల నిరసనలతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ ప్రపంచం మొత్తం చూసిన ఈ సినిమాను కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు మాత్రమే వీక్షించలేకపోయారు. సినిమాలో స్టోరీ సహా అన్నీ లీకైన తర్వాత ఏపీలో రిలీజ్ కాబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆంధ్ర బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

 

 

 

ఇకపోతే.. వర్మ ఏ టార్గెట్ తో ఈ సినిమా తీశాడో అది నెరవేరలదు. ఎన్నికల ముందు టీడీపీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా వర్మ స్కెచ్ వేశాడు. కానీ అది సాధ్యపడలేదు. ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయినా కాకపోయినా అదేమి మ్యాటర్ కాదు. అంతేకాదు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. మజిలీ, జెర్సీ, చిత్రలహరి చిత్రాలతో పాటు అవెంజర్ సినిమాలు సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 4 సినిమాలను కాదని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంవైపు ఏపీ ప్రేక్షకులు మొగ్గు చూపిస్తారా అంటే అనుమానమే. మొత్తంగా వర్మ ఈగలు తోలుకోవడం కామన్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags : andhra pradeshap cmchandrababuLAKSHMI PARVATHIlakshmis ntrnt rama raoram gopal varma

Also read

Use Facebook to Comment on this Post



Menu