03/26/19 9:16 PM

అనుకున్నది సాధించిన వర్మ : లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు లైన్ క్లియర్

Line Clear For Lakshmis Ntr Movie Release

కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశయమైన రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు నిర్మాత రాకేష్ రెడ్డి వెల్లడించారు. దీంతో మార్చి 29న ఈ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

సినిమాలో ఉన్న సీన్లు, డైలాగ్స్ విషయంలో జారీ అయిన సర్టిఫికేషన్ ను నిర్మాత రాకేశ్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు సమర్పించారు. దీంతో ఎన్నికల కమిషన్ దీనిని పరిశీలించినట్టు ఆయన చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎవరినీ కించపరచ లేదని, ఎన్టీఆర్ జీవితం చివరి దశలో జరిగిన విషయాలను చెప్పేందుకే ఈ సినిమా చేశామని ఎన్నికల కమిషన్ కు వివరించానని రాకేశ్ రెడ్డి తెలిపారు. తాను వైసీపీ నాయకుడే అయినా.. జగన్ తో ఎలాంటి బంధుత్వం లేదన్నారు.

 

ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ఉందని ఈసీకి ఫిర్యాదు అందటంతో ఈ చిత్రానికి సెన్సార్ నుండి క్లియరెన్స్ లభించలేదు. దీంతో ఈసీ నుండి నోటీసులు అందుకున్న చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి సోమవారం నాడు రాత పూర్వకమైన వివరణ ఇచ్చారు. ఒక పార్టీకి అనుకూలంగా ఈ సినిమాను తీయలేదని, తమ నాయకుడు జగన్ ఒక సినిమాను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని రాకేష్ రెడ్డి తెలిపారు. ఒకవేళ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’పై అభ్యంతరాలు ఏమైనా ఉంటే సినిమా విడుదలైన తర్వాత కూడా ఈసీకి వివరణ ఇస్తానని రాకేశ్ రెడ్డి తెలిపారు. ఇందులో ఒక పార్టీకి అనుకూలంగా లేదని.. జరిగిన వాస్తవాన్ని మాత్రమే చూపించమన్నారు.

 

ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 29న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని విడుదల చేసి తీరతానని శపథం చేసిన వర్మ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఆఖరుకి నిజమే గెలిచిందన్నారు. ‘ట్రూత్ విన్ అంటూ చంద్రబాబుని ట్యాగ్ చేసిన వర్మ.. సెన్సార్ నుండి క్లీన్ యూ సర్టిఫికేట్ లభించిందని ట్వీట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ వర్మ కామెంట్ చేశాడు.

Tags : censor boardchandrababuelection commissionlakshmis ntr movie releaserakesh reddyram gopal varmaRGVys jagan

Also read

Use Facebook to Comment on this Post



Menu