05/16/19 6:39 PM

మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు

Maharshi First Week Boxoffice Collections

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా మహర్షి. సోషల్ మేసేజ్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటివారంలో ఈ సినిమా రూ.59.37 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తొలివారంలో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 21.67 కోట్ల షేర్ ను సాధించడం విశేషం. మహేష్ బాబు కెరియర్ లోనే ఇవి అత్యధిక వసూళ్లని చెబుతున్నారు. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో ‘మహర్షి’ సినిమాని తెలుగు చిత్రపరిశ్రమలో ముగ్గురు పెద్ద నిర్మాతలు(పీవీపీ, అశ్వినీ దత్, దిల్ రాజు) కలిసి నిర్మించారు.

 

మ‌హ‌ర్షి సినిమా తొలివారం నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా వెన‌క‌బ‌డినా ఏపీ, తెలంగాణ‌లో మాత్రం మ‌హ‌ర్షి దెబ్బ‌కు రంగ‌స్థ‌లం రికార్డులు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం స‌త్తా చాటింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రో భారీ సినిమా ఏదీ లేక‌పోవ‌డంతో పూర్తిగా మ‌హేష్ మేనియా సాగింది. తొలివారం 60 కోట్లు షేర్ వ‌సూలు చేయగా, గ్రాస్ కూడా దాదాపు రూ.80 కోట్ల‌కు పైగానే ఉంది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు రూ.75 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం సేఫ్ కావాలంటే మ‌రో రూ.30 కోట్లు రావాల్సి ఉంది. రెండో వారం కూడా మ‌హ‌ర్షి దూకుడు కొన‌సాగేలా క‌నిపిస్తోంది. ఈ చిత్రానికి పోటీగా మ‌రో సినిమా లేకపోవడమే కారణం.

Tags : ANDHRAfirst week collectionsMaharshimahesh babunizamTelangana

Also read

Use Facebook to Comment on this Post



Menu