05/15/19 11:49 PM

మహేష్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ : మహర్షి వసూళ్ల సునామీ

Maharshi Movie Record Collections In Nizam Area

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వంశీపైడి పల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా మహర్షి. మంచి సోషల్ మేసేజ్ తో ఈ సినిమాని తీశారు. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ సినీ కెరీర్ లో 25వ సినిమా ఇది. ఈ మూవీ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ మహర్షి దూసుకుపోతోంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా నైజామ్ లో ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్మురేపుతోంది. విడుదలైన 6 రోజుల్లో ఈ సినిమా నైజామ్ ఏరియాలో రూ. 20.54 కోట్ల షేర్ ను రాబట్టింది.

 

ఇంతవరకూ మహేష్ చేసిన సినిమాల్లో నైజామ్ లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా ఇదేనని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. ఇక్కడ మహేష్ బాబు పేరుతో ఉన్న రికార్డులను మహేష్ అధిగమించాడు. ‘మహర్షి’ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం మహేష్ లో ఆనందాన్ని నింపింది. మహేష్ అభిమానులూ ఫుల్ ఖుషీగా వున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ బాబు సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.

 

శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు సోషల్ మేసేజ్ తోనే వచ్చాయి. జనాలకు బాగా నచ్చాయి. అందులోని సందేశాలకు ఆదరణ లభించింది. ఇప్పుడు అదే రీతిలో మహర్షి సినిమా వచ్చింది. రైతుల కష్టాల గురించి డైరెక్టర్ బాగా చూపించారు. అంతేకాదు.. వీకెండ్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ హిట్ అయ్యింది. యువత నుంచి ఆదరణ లభిస్తోంది. సోషల్ మేసేజ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటంతో సినిమా హిట్ టాక్ సంపాదించుకుందని ట్రేవ్ వర్గాలు చెబుతున్నాయి.

Tags : boxofficecollectionshitMaharshiMaheshbabunizamrecordvamsi paidipally

Also read

Use Facebook to Comment on this Post



Menu