05/2/19 12:37 PM

ప్రపంచాన్ని ఏలేద్దాం.. యూట్యూబ్ ట్రెండింగ్‌ నెంబర్ 1 మహర్షి ట్రైలర్

Maharshi Trailer New Record

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25 వ చిత్రం ‘మహర్షి’. మహేశ్ బాబు, పూజా హెగ్డే జంటగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వారం రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా, బుధవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో మహర్షి ప్రీ రిలీజ్‌ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ, విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్టులుగా వచ్చారు. మూవీ థియేటరికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.ఈ ట్రైలర్ కు విశేషమైన స్పందన వచ్చింది.

 

నిన్న రాత్రి 9 గంటల వ్యవధిలో ఇది విడుదల కాగా, మే 2వ తేదీ మధ్యాహ్నం సమయానికి 3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో నంబర్ వన్ స్థానంలో ‘మహర్షి’ ట్రైలర్ ఉంది. చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ లో ఈ విషయాన్ని తెలిపింది. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘ఏం సాధిద్దాం అనుకుంటున్నావు రిషి’ అని రావు రమేశ్‌ ప్రశ్నిస్తే.. ‘ఏలేద్దాం అనుకుంటున్నాను సర్‌. ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నా’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. ‘ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం..’ వంటి పవర్‌ఫుల్ డైలాగులతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

 

అల్లరి నరేష్‌, పోసాని కృష్ణమురళి, మీనాక్షి దీక్షిత్‌, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, రావు రమేశ్‌, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. దిల్‌ రాజు, అశ్వినీ దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మాతలు.

Tags : allari nareshdspMaharshi Trailermahesh babupooja hegdevamshi paidipallyvenkateshvijayh deverakonda

Also read

Use Facebook to Comment on this Post



Menu