05/30/19 9:59 PM

మహేష్ బాబు 26వ సినిమా ఇదే : రాములమ్మ రీఎంట్రీ

Mahesh Babu 26th Movie, Sarileru Neekevvaru

భరత్ అనే నేను, మహర్షి సినిమా సక్సెస్ లతో ఊపుమీదున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు 26వ సినిమాకి రెడీ అయ్యాడు. ఈ సినిమానికి అనిల్ రావిపూడి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. శుక్రవారం హైదరాబాద్ – అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆ తర్వాత పెద్ద గ్యాప్ తీసుకోకుండానే రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.

 

ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మికను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కీలకమైన పాత్రల్లో విజయశాంతి – రమ్యకృష్ణ కనిపించనున్నారట. ఇక ‘మహర్షి’ సినిమాకి దేవిశ్రీ అందించిన ఆడియోకి తక్కువ మార్కులు పడిన నేపథ్యంలో, ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఆయననే తీసుకుంటారా? తమన్ కి అవకాశం ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకి ‘సరిలేరు నీ కెవ్వరూ’ అనే టైటిల్ అనుకున్నారు. ఆ తరువాత ‘రెడ్డిగారి అబ్బాయి’ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. దీంతో ‘సరిలేరు నీ కెవ్వరూ’ అనే టైటిల్ లేనట్టేనని అంతా అనుకున్నారు. కానీ ఈ టైటిల్ వైపే మహేశ్ బాబు మొగ్గుచూపాడట. అందువలన ఈ టైటిల్ నే రిజిస్టర్ చేయించారని అంటున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను 6 నెలల్లో పూర్తిచేసి, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందుతుండటంతో, అంచనాలు పెరిగిపోతున్నాయి.

 

గతంలో దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతూ స్టార్ హీరోల సరసన నటించిన లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి మహేష్ 26తో రీ ఎంట్రీ ఇవ్వనుండటం ఈ సినిమా పట్ల మరింత క్రేజ్ పెంచేసింది. చాలా ఏళ్ల తర్వాత వెండితెరపై విజయశాంతి పెర్ ఫార్మెన్స్ చూసేందుకు అంతా ఆసక్తిగా ఉన్నారు. మహేష్ 25 వ సినిమా మహర్షికి ముగ్గురు నిర్మాతలు కావడం బాగా కలిసొచ్చిందనే సెంటిమెంట్ తో తన 26 వ సినిమాకు కూడా ముగ్గురు నిర్మాతలు ఉండాలని డిసైడ్ అయ్యారట మహేష్. ఈ మేరకు నిర్మాతలు దిల్‌రాజు, అనిల్‌ సుంకరలతో పాటు ఈ చిత్ర నిర్మాణంలో మహేష్‌బాబు కూడా భాగం అవుతుండటం విశేషం.

Tags : 26th movieAnil ravipudimahesh baburashmika.sarileru NeekevvaruVijayashanti

Also read

Use Facebook to Comment on this Post



Menu