07/22/19 6:18 PM

ఇదీ మీ ట్రాక్ రికార్డ్ : తోపు డైరెక్టర్ అని ఫీల్ అవుతున్న పూరీ సార్ సిగ్గుపడండి

Mahesh Babu Fan Powerful Counter For Puri Jagannadh

సార్ పూరీగారు,

పోకిరి తీసేనాటికి ఆంధ్రావాలా పేరుతో భారతి ఎంటర్ ప్రైజెస్ గిరిగార్ని ముంచారు తమరు..

 

తమ్ముడ్ని తెచ్చి సొంతంగా తీసుకున్న 143 కూడా ఆడలేదు..

 

కత్తుల్లాంటి అనుష్క, అయేషాటకియాలు దొరికారు కదాని సూపర్ సినిమా చుట్టి పారేశారు.. ఏమైంది..??

 

ఇన్ని ఫ్లాపుల్లో ఉండగా ‘సన్నాఫ్ ఉత్తమసింగ్’ అనే టైటిల్ లో స్టోరీ పట్టుకుని అందరి దగ్గరికి తిరిగి, ఎక్కడా పనవ్వకపోతే అప్పుడు ఎవరిచ్చారు ఛాన్స్ మీకు.. ??

 

మహేష్..

పోకిరిగా పేరు మార్చారు ఇండస్ట్రీ హిట్టు కొట్టారు ఇద్దరూ కల్సి..

అయిపోయింది..

 

దేశముదురు, చిరుత దాకా బాగానే ఉంది బండి.. అక్కడ్నించే మొదలయ్యింది పీడాకాలం..

 

తమరి దైనందిన జీవితంలోకి బ్యాంకాక్, పట్టాయాల ప్రవాసం వచ్చి చేరాక సినిమా మేకింగ్ లో అసలు స్క్రిప్టు చిన్నదైంది. మీ పర్సనల్ మేకింగ్ పెద్దదయ్యింది..

 

ఆ రోజునించి మొదలుకుని గోలీమార్, నేనూ నా రాక్షసిలదాకా ఒక్కటైనా హిట్టుందా మీ పైత్యం తప్ప..

 

ఈ సినిమాల షూటింగ్ టైంలోనే గదా ఓ మంచి హీరో తమరి సహవాస దోషంలో మత్తెక్కువై ఓ మాదక దినాన పట్టాయాలో ఒంటి మీద గుడ్డలు లేకుండా తిరిగేడని సినీ లోకం మైకై కూసింది..

 

ఫస్ట్ టైం మీ మీద రిమార్కు.. అప్పుడే మొదలు..

 

కానీ ఇందులో నిజానిజాలు ఎంతో మనకి తెలీవు కాబట్టి ఎలా నమ్ముతాంలే అనుకున్నాడు మహేష్ బాబు కూడా నాలాగే.. కాబట్టే బిజినెస్ మేన్ టేబులెక్కగలిగింది, పర్లేదనిపించుకోగలిగింది..

 

సరే, దాని తర్వాతైనా ట్రాక్ లో పడ్డారా అంటే.. !! అబ్బే.. దాంతర్వాత కూడా డాబే తప్ప పంచె డాబు ఉంటేగా.. !!

 

మీరే సినీ జీవితం ఇచ్చిన రవితేజ ఓ అవకాశమిస్తే మీరేమిచ్చారు.. అరటితొక్క వేశాకా, వెయ్యకుండా అని ఓ తొక్కలో కథలేని సినిమా తీసి చిప్ప చేతికిచ్చారు.. !!

 

ఆ తర్వాత లోఫర్, రోగ్, మన్ను, మశానం, మట్టగిడసలు.. ఏవన్నా కళాఖండాలా సామీ అసలు.. ??

 

ఈలోగా ఆటోజానీ ఒప్పుకోలేదని చిరంజీవి మీద విమర్శలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కెలకడం.. అవి చాలవన్నట్టు తమరి ‘కేవ్’ సహజీవనవాసాలు, డ్రగ్ కేసులు..

 

ఇన్ని దరిద్రాల మధ్య రాక రాక వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఇప్పుడు ఇరగదీసేస్తోందన్న భ్రమలో ఉన్నారేమో..

 

ఫర్ సపోజ్, బేరాల్లేని ఓ పాత ఐటెంసాంగ్ హీరోయిన్ ని తీసుకొచ్చి తిరుణాళ్ళలో టైర్ల బండి మీద డ్యాన్సేయిస్తే రసికజనం ఆటోమేటిగ్గా పరిగెత్తుకునొస్తారు ‘రండ్రా తెరమీదకి, బయటకి ఏవన్నా తేడా ఉందేమో చూసొద్దామని..’ ఇది కూడా అంతే దొరా..!!

 

ఒకప్పుడు పెద్ద డైరెక్టర్ గా వెలగబెట్టిన తమరు బీ గ్రేడ్ సినిమాలు తీస్తే ‘ఆ స్టఫ్’ కోరుకునే జనం ఎందుకు రాకుండా ఉంటారు..?? వస్తారు చిల్లర విసురుతారు.. కాకపోతే ఆ మొత్తం చిల్లర మీ ఇతర సమకాలీన దర్శకుల హిట్ సినిమాల రెండు రోజుల కలెక్షన్లకి సమానం.. దాన్ని చూసి షాంపేన్లు మీద ఒంపుకుని మురిసిపోవడమే..

 

మనదగ్గర ఇన్ని బొక్కలెట్టుకుని 100 కోట్ల మార్కెట్టున్న హీరో నాతో సినిమా చెయ్యట్లేదని మడమలు తొక్కుకుంటే ఎలా చెప్పండి.. ?? కమర్షియల్ డైనమిక్స్ విపరీతంగా పెరిగిపోయిన ప్రెజెంట్ టైంలో మన టాప్ హీరోలకు ఈ నాసిరకం సినిమాలతో వచ్చే చిల్లర యే పాటి.. ??

 

రంగస్థలం లాంటి క్లాసిక్ ఇచ్చిన సుకుమార్ తర్వాతి సినిమాకని ఓ కథ పట్టుకెళ్లినా సరే మహేష్ ఎందుకు పక్కన పెట్టేసినట్టో.. స్టోరీ నచ్చకే కదా..

 

మీరప్పుడెప్పుడో పదమూడేళ్ల క్రితం పోకిరి ఇచ్చేరని చెప్పి ఇప్పుడు వేళ్ళు నలుపుకుని తర్వాత చేతులు కాల్చుకోవాలా.. ?? ఆకారం చూసి ఆశపడి, తీరా కట్టుకున్నాక అసలు నిజం బయటపడి లబోదిబోమనేకంటే ముందుగానే దూరం పెట్టడం బెటర్ కదా..

 

కాబట్టి తమరు ఇన్నాళ్లూ తీసినవి గొప్ప ఆణిముత్యాలనే మైకంలో ఇంకోసారి ఇలాంటి సిల్లీ సింతకాయ్ స్టేట్మెంట్లిచ్చి తమరంటే ఉన్న రెస్పెక్ట్ పోగొట్టుకోవద్దని సవినయంగా మనవి జేస్కుంటున్నాం సార్.. !!

 

ఛార్మీ జాగ్రత్త సార్.. !!

 

హరిబాబు మద్దుకూరి, మహేష్ బాబు ఫ్యాన్

Tags : charmicontroversyismart shankarmahesh babumahesh babu fanPokiriPuri JagannadhRamram gopal varma

Also read

Use Facebook to Comment on this PostMenu