04/24/18 9:47 PM

మహేష్ బాబు ఆ విధంగా ‘అర్జున్ రెడ్డి’కి భారీ హ్యాండ్ ఇచ్చాడు!

Untitled-1 copy

అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత  ఎన్నో బ్రహ్మాండమైన ఆఫర్లు వచ్చినప్పటికీ ఆ చిత్ర దర్శకుడు సందప్ వంగా ఇప్పటి దాకా మరో చిత్రానికి కమిట్ అవ్వలేదు. దీనికి కారణం.. మహేష్ బాబు తో తన రెండో చిత్రాన్ని తీయాలని అతడు ప్రయత్నిస్తుండటమే.  సందీప్ తో చేసేందుకు మహేష్ కూడా ఆసక్తి చూపడంతో మైత్రీ మూవీ మేకర్స్‌ అతడికి అడ్వాన్స్ ను కూడా అందచేసింది.

 

అయితే, ఇటీవల మహేష్  తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. రంగస్థలం లాంటి బ్లాక్‌ బస్టర్ సినిమాను అందించిన సుకుమార్‌తో అతడు తన తదుపరి చిత్రాన్ని చేసేందుకు అతడుతాజాగా కమిట్ అయ్యాడు. రంగస్థలం చిత్రం విపరీతంగా నచ్చడంతో..సుకుమార్‌తోనే చేయాలని మహేష్ డిసైడ్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం  మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో మహేష్ చాలా కాలం తర్వాత ఓ మాస్‌ క్యారెక్టర్ చేస్తున్నాడు.

 

గమ్యం సినిమాలో అల్లరి నరేష్ చేసిన ‘గాలి శ్రీను’ తరహాలో ఆయన పాత్ర ను వంశీ పైడిపల్లి డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.   దిల్ రాజు- అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ కల్లా పూర్తి చేసి..తదనంతరం సుకుమార్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నాడట. మరో వైపు, మహేష్ ఆఖరి నిమిషంలో హ్యాండ్  ఇవ్వడంతో తన రెండో చిత్రం కోసం  మరో హీరోను వెతుక్కునే పనిలో సందీప వంగా పడ్డాడు.

mythri

Tags : Arjun reddyarjun reddy directorbharat ane nenubig handmahesh babumythri movie makersRangasthalamsandeep vangasukumar

Also read

Use Facebook to Comment on this Post



Menu