08/9/18 7:22 PM

మహేషా మజాకా.. ట్రెండింగ్ లో టీజర్..!

Untitled-1 copy

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. మహేష్ కెరీర్ లో 25వ సినిమా కావడంతో.. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా.. ఈ మూవీకి సంబంధించి స్టోరీ విషయంలో కానీ టైటిల్ విషయంలో కానీ.. ఎలాంటి సమాచారం బయటకు రాకుండా డైరెక్టర్ సస్పెన్స్ మెయింటేన్ చేశాడు. దీంతో టైటిల్ గురించి అనేక ఊహాగానాలు వినిపించాయి. చివరికి మహేష్ బర్త్ డే కానుకగా.. టైటిల్ ను రివీల్ చేశారు డైరెక్టర్ వంశీ పైడిపల్లి.

 

మహేష్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. తన 25వ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ సూపర్ ట్రీట్ ఇచ్చారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్‌ ను అర్ధరాత్రి విడుదల చేసి సర్‌ ప్రైజ్ ఇచ్చారు. గత వారం రోజులుగా మహేష్ 25వ చిత్రానికి సంబంధించిన సర్‌ప్రైజ్‌ లు ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు. ఈ చిత్రంతో వినూత్న ప్రచారానికి తెరతీసిన దర్శకుడు వంశీ పైడిపల్లి.. ఈ సినిమాకు సంబంధించి ఒక్కో ఆంగ్ల అక్షరం విడుదల చేస్తూ.. అభిమానుల మెదడుకు పనిచెప్పారు.

 

ముందుగా.. ‘R’ అనే లెటర్‌ ని విడుదల చేసి.. తరువాత ‘I’, ‘S’, ‘H’ లెటర్స్ ను రివీల్ చేశారు. తాజాగా చివరి లెటర్ ‘I’ని రివీల్ చేశారు. దీంతో మహేష్ 25 మూవీ టైటిల్ RISHI (రిషి) అనుకున్నారంతా.. అయితే ప్రేక్షకులకు సర్‌ ప్రైజ్ ఇస్తూ.. రిషి అనేది ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ పేరు మాత్రమే అని అసలు టైటిల్ ‘మహర్షి’ అంటూ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ ను రివీల్ చేశారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌ లో మహేష్.. కాలర్ ఎగరేస్తూ ల్యాప్ టాప్ పట్టుకుని నడిచి వస్తున్న లుక్ ఫ్యాన్స్ ను ఊపేస్తోంది.

 

ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా.. దిల్‌ రాజు, అశ్విని దత్‌, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ 2019 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ‘మహర్షి’.

 

మరోవైపు ‘మహర్షి’ టీజర్‌ ట్రెండింగ్‌ అవుతోంది. సోషల్‌ మీడియా మొత్తం మహేష్‌ బాబు ట్రెండింగ్‌ నడుస్తోంది. మహేష్‌ బర్త్‌ డే విషెస్‌, మహర్షి టీజర్‌ లు  ట్విటర్‌ లో ట్రెండ్‌ అవుతున్నాయి. ఇక ఈ టీజర్‌ ను ఇప్పటికే 1.5 మిలియన్ల మంది వీక్షించారు.

Tags : Maharshimaharshi teasermahesh babumahesh babu birthdayrishivamsi paidipally

Also read

Use Facebook to Comment on this Post



Menu