04/5/19 1:17 PM

‘మజిలీ’ మూవీ రివ్యూ

Majili Telugu Movie Review

టైటిల్ : మజిలీ
జానర్ : రొమాంటిక్‌ డ్రామా
నటీనటులు : నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌషిక్‌, రావూ రమేష్‌
సంగీతం : గోపి సుందర్‌
నేపథ్య సంగీతం : తమన్‌
దర్శకత్వం : శివా నిర్వాణ
నిర్మాత : సాహు గారపాటి, హరీష్ పెద్ది
రిలీజ్ డేట్ : 5 ఏప్రిల్ 2019
పెళ్లికి ముందు నాగచైతన్య, సమంతలు 3 సినిమాల్లో నటించారు. పెళ్లయ్యాక మాత్రం కలిసి నటించిన చిత్రం ”మజిలీ”. టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగేలా చేశారు. చైతూ ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. మాస్‌ యాక్షన్‌ జానర్ లో తెరకెక్కించిన సినిమాలన్ని వరుసగా ఫ్లాప్‌ కావటంతో మరోసారి తనకు మంచి పట్టున్న రొమాంటిక్‌ డ్రామానే ఎంచుకున్నాడు. అంతేకాదు తన రియల్‌ లైఫ్‌ పార్టనర్‌తో కలిసి రీల్‌ లైఫ్‌లో మరో సక్సెస్‌ కొట్టేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా సక్సెస్‌ ఫుల్‌ ఎంట్రీ ఇచ్చిన శివా నిర్వాణ దర్శకత్వంలో చైతూ, సమంత జంటగా తెరకెక్కిన సినిమా మజిలీ. మరి ఈ సినిమా అయినా చైతూ కెరీర్‌ను సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కించిందా..? ప్రేక్షకులను అలరించేలా ఉందా? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
పూర్ణ (అక్కినేని నాగచైతన్య) టీనేజ్ కుర్రాడు. క్రికెట్ ప్లేయర్ కూడా. ఎలాగైన రైల్వేస్‌ టీమ్‌లో క్రికెటర్‌గా స్థానం సంపాదించాలని ప్రాక్టీస్‌ చేస్తుంటాడు. ఓ గొడవ కారణంగా పరిచయం అయిన అన్షు (దివ్యాంశ కౌశిక్‌)తో పూర్ణ ప్రేమలో పడతాడు. కానీ పెద్దలు వారి ప్రేమకు అడ్డు చెప్తారు. అన్షును తన పేరెంట్స్ పూర్ణకు దూరంగా తీసుకెళ్లిపోతారు. అన్షు దూరమైందన్న బాధలో పూర్ణ కెరీర్‌ను కూడా వదిలేసి తాగుబోతులా తయారవుతాడు. అలా డిప్రెషన్ లో ఉండగానే శ్రావణి (సమంత)తో పెళ్లి చేస్తారు. ప్రేయసిని మర్చిపోలేక భార్యతో సరిగా కాపురం చేయలేక పూర్ణ ఎలాంటి మానసిక క్షోభ అనుభవించాడు. చివరకు పూర్ణ-శ్రావణి ఒక్కటయ్యారా? లేదా? అన్నదే స్టోరీ.

ప్లస్:
నాగచైతన్య, సమంత నట
దివ్యంశ కౌశిక్ గ్లామర్
పాటలు
నేపథ్య సంగీతం
సెంటిమెంట్

మైనస్:
స్లో నెరేషన్

నటీనటులు:
కొత్త అమ్మాయి దివ్యాంశ కౌశిక్ గ్లామర్ తో అలరించింది అలాగే నటనతో ఆకట్టుకుంది. సమంత ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచింది. సమంత నటన గురించి కొత్తగా చెప్పేదేముంది. మధ్య తరగతి గృహిణిగా అద్భుతంగా నటించింది. నాగచైతన్య నటన విషయానికి వస్తే నటుడిగా మజిలీ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమాలో రెండు విభిన్న కోణాలున్న పాత్రలో చాలా బాగా నటించాడు. టీనేజ్ కుర్రాడిగా, తీవ్ర మానసిక క్షోభ అనుభవించే యువకుడిగా రెండు విభిన్న కోణాలను ప్రదర్శించి నటుడిగా మరో మెట్టు ఎదిగాడు చైతూ. ఇద్దరు హీరోయిన్ లతో మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా జాగ్రత్త పడ్డాడు చైతూ. ఇతర పాత్రల్లో రావూ రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, అతుల్‌ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం:
నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శివా నిర్వాణ మరోసారి ఎమోషనల్‌ డ్రామానే ఎంచుకున్నాడు. మరోసారి హృదయానికి హత్తుకునే అంశంతో మజిలీ ని రూపొందించి విజయం సాధించాడు. ఎలాంటి కమర్షియల్‌ హంగులకు పోకుండా తను అనుకున్న కథను రియలిస్టిక్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. కథనం నిన్నుకోరి తరహాలోనే అనిపించినా ప్రేక్షకుడిని కట్టి పడేయటంలో దర్శకుడు మరోసారి సక్సెస్‌ అయ్యాడు. ఎమోషనల్ లవ్ డ్రామాతో హిట్ కొట్టాడు. మలయాళ సంగీత దర్శకుడు గోపీ సుందర్ పాటలు అలరిస్తాయి. తమన్ తన నేపథ్య సంగీతంతో సీన్స్ ను మరోస్థాయికి తీసుకెళ్లాడు. తమన్ రీ రికార్డింగ్ మజిలీ కి హైలెట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

రేటింగ్: 3/5

Tags : Director Shiva Nirvanadivyansha kaushikmajili movie reviewmusic director Gopi Sundarnaga chaitanyas thamansamantha

Also read

Use Facebook to Comment on this PostMenu