06/12/19 9:26 PM

మెగా హీరోకి తృటిలో తప్పిన ప్రమాదం

Mega Hero Escape From Road Accident

మెగా హీరో, నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. మరో కారు ఆయన కారును బలంగా ఢీకొట్టింది. అయితే వరుణ్ అదృష్టవశాత్తూ క్షేమంగా బయటపడ్డారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట వద్ద జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఈ యాక్సిడెంట్ జరిగింది.

 

వరుణ్, మరికొందరు నటులు ‘వాల్మీకి’ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో నటులకు ముప్పు తప్పింది. ఈ సంఘటనలో రెండు కార్ల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వరుణ్‌ తేజ్‌, ఇతర నటులు మరో కారులో బెంగళూరు వెళ్లిపోయారు. వరుణ్ కారును ఢీకొట్టిన వాహనంలోని యువకులు మద్యం తాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

 

రోడ్డు ప్రమాదంపై వరుణ్ తేజ్ స్పందించారు. ‘‘రోడ్డు ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు అందరం సురక్షితం. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. నాపై మీ ప్రేమాభిమానాలు చూపించినందుకు ధన్యవాదాలు.’’ అని సోషల్ మీడియా ద్వారా వరుణ్ తేజ్ తెలిపారు.

Tags : escapeMega heroroad accidentshootingvalmiki movieVarun Tej

Also read

Use Facebook to Comment on this Post



Menu