06/24/19 9:13 PM

సెన్సెషన్ గా మారిన మెగా హీరో లుక్

Mega Hero Varun Tej New Look

మెగా హీరో వరుణ్ తేజ్.. తాజా మూవీ వాల్మీకి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్. ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ శంకర్ ప్రీ టీజ‌ర్ విడుద‌ల చేసాడు. ఈ ప్రీ టీజర్ సినీవర్గాల్లో సెన్సేషన్ గా మారింది. దీనికి కారణం ఇందులో వరుణ్ తేజ్ లుక్. ఇప్పటి వరకు చూడని లుక్‌లో కనిపించి వరుణ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. వ‌రుణ్ తేజ్ మ‌రీ రాక్ష‌సంగా క‌నిపిస్తున్నాడు. ఈయ‌న లుక్ చూసి నిజంగానే భ‌యం వేస్తుంది. మ‌రి రేపు సినిమాలో ఇంకెలా ఉంటాడో..? అని సినీ అభిమానులు అనుకుంటున్నారు.

 

ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 6న ఈ చిత్రం రిలీజ్ కానుంది. వాల్మీకి చిత్రం త‌మిళ‌నాట హిట్ అయిన జిగ‌ర్తాండ సినిమాకు రీమేక్. ఇందులో నెగిటివ్ కారెక్ట‌ర్ చేస్తున్నాడు వ‌రుణ్ తేజ్. త‌మిళ హీరో అథ‌ర్వ ముర‌ళి మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. డీజే త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి.

 

కాగా, ‘వాల్మీకి’ టైటిల్‌ గతంలో వివాదానికి దారితీసింది. గ్యాంగ్‌స్టర్ మూవీకి వాల్మీకి పేరు ఎలా పెడతారని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఈ సినిమా షూటింగ్ మొదలుకాక ముందే వార్తల్లోకి ఎక్కింది. ఆ తర్వాత ఈ గొడవ సద్దుమణిగింది.

Tags : harish shankarMega heronew lookpre teasersurpriseValmikiVarun Tej

Also read

Use Facebook to Comment on this Post



Menu