09/9/19 9:15 PM

ట్రైలర్ లోనే ఈ రేంజ్ లో ఉంటే.. సినిమాలో ఎలా ఉంటాడో…

varun tej valmiki movie trailer

మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమా వాల్మీకి. గతంలో ఎన్నడూ పోషించని పాత్రలో వరుణ్ కనిపిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ సోమవారం రిలీజ్ అయ్యింది. హరీష్ శంకర్ డైరెక్షన్ వహించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నారు. చదువుకనే సమయం నుంచి రఫ్ అండ్ టఫ్ గా ఉండే వ్యక్తిగా కనిపించబోతున్నాడు. గద్దలకొండ గణేష్.. అలియాస్ ఘనిగా వరుణ్ నటిస్తున్నాడు. కాలేజీలో సరదాగా, పూజా హెగ్డే ప్రేమికుడిగా కనిపించిన వరుణ్.. ఎందుకు అలా గ్యాంగ్ స్టర్ గా మారాల్సి వచ్చింది అనే విషయాలను సినిమాలో చూపించబోతున్నారు.

 

మేకింగ్ పరంగా సినిమా సూపర్ గా ఉన్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతున్నది. వరుణ్ లోని మరో యాంగిల్ ను సినిమాలో చూపించినట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. తెలంగాణ యాసలో వరుణ్ చెప్పిన డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. సెప్టెంబర్ 20న సినిమా రిలీజ్ కాబోతున్నది. నాపై పందాలేస్తే గెలుస్తారు.. నాతో పందాలేస్తే చస్తారు అనే డైలాగ్ సూపర్బ్ గా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. గబ్బర్ సింగ్ లో పోలీస్ స్టేషన్ లో అంత్యాక్షరి టైప్ కామెడీని ఇందులో ట్రై చేసినట్టుగా తెలుస్తోంది.

 

వరుణ్ తేజ్ నటనలో తన విశ్వరూపం చూపించాడు అని..వాల్మీకి ట్రైలర్ చూసిన వారంతా అంటున్నారు. భిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు వరుణ్ తేజ్. కచ్చితంగా ఈ చిత్రంతో వరుణ్ తేజ్ సంచలనాలు రేపడం ఖాయం అంటున్నారు. ముఖ్యంగా వరుణ్ లుక్స్.. నటన సినిమాపై అంచనాలు పెంచేశాయి. ట్రైలర్‌లో వ‌రుణ్ తేజ్ మ‌రీ రాక్ష‌సంగా క‌నిపిస్తున్నాడని, లుక్ చూస్తే భ‌యం వేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ట్రైలర్ లోనే ఈ రేంజ్ లో ఉంటే సినిమాలో ఇంకెలా ఉంటాడో అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2 లాంటి సాఫ్ట్ సినిమాల తర్వాత వరుణ్ చేస్తున్న సినిమా ఇదే.

 

డైలాగులు అదిరిపోయాయి. గద్దలకొండ గణేష్ అంటూ వరుణ్ రప్ఫాడించాడు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వచ్చినపుడు పూజా హెగ్డేపై ఎల్లువొచ్చి పాట ఆర్ఆర్ వాడుకున్నాడు హరీష్ శంకర్. గవాస్కర్ సిక్స్ కొట్టుడు.. బప్పీలహరీ పాట కొట్టుడు.. నేను బొక్కలిరగ్గొట్టుడు సేమ్ టూ సేమ్ అంటూ వరుణ్ తేజ్ చెప్పిన మాటల తూటాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ చిత్రం త‌మిళ‌నాట హిట్ అయిన జిగ‌ర్తాండ సినిమాకు రీమేక్.

 

ఇందులో నెగిటివ్ కారెక్ట‌ర్ చేస్తున్నాడు వ‌రుణ్ తేజ్. త‌మిళ హీరో అథ‌ర్వ ముర‌ళి మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. డీజే త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది.

Tags : gangsterharish shankarpooja hegdeTollywoodTrailerValmikiVarun Tej

Also read

Use Facebook to Comment on this Post



Menu