11/26/18 12:40 PM

పల్లె కోకిల బేబీ టాలెంట్‌కు మెగాస్టార్ ఫిదా..!

Megastar Chiranjeevi Praises Singer Baby

బేబీ.. ఒకప్పుడు ఓ సాధారణ గ్రామీణ మహిళ. కానీ ఇప్పుడు ఓ సెలబ్రిటీ సింగర్. గ్రామీణ గాయని కాస్తా గాన కోయిల, పల్లె కోయిల అయింది. అలాంటి ఇలాంటి సెలబ్రిటీ కాదు.. ఏకంగా దిగ్గజ సంగీత దర్శకులు ఏఆర్ రెహ్మాన్, ఎస్పీ బాలు, కోటి తదితరులు మెచ్చిన గ్రామీణ గాయని. తన సింగింగ్ టాలెంట్‌తో బేబీ ఇప్పుడు పాపులర్ అయ్యారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఆమె టాలెంట్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల బేబీ పాడిన ఓ పాట సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పల్లె కోయిన ఫ్యాన్స్ లిస్టులోకి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా చేరిపోయింది. బేబీ ప్రతిభకు చిరంజీవి ఫిదా అయ్యారు.

Image result for chiranjeevi singer baby
తూర్పుగోదావరి జిల్లా వడిశలేరు గ్రామానికి చెందిన 40 ఏళ్ల బేబీ పొలం పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆమెకు అద్భుతమైన సింగింగ్ టాలెంట్ ఉన్న విషయం… వీడియో వైరల్ అయ్యే వరకు ఎవరికీ తెలియదు. ఏఆర్ రెహ్మాన్ ఆమె వీడియో షేర్ చేయడంతో విషయం అందరికీ తెలిసింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సంగీత దర్శకుడు కోటి ద్వారా ఆమెను తన ఇంటికి పిలిపించి అభినందించడం విశేషం.

ఒక్కసారి విని అద్భుతంగా పాడేస్తున్నారు
మెగాస్టార్ చిరంజీవిని చూడగానే బేబీ భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే ఆయన కాళ్ల మీద పడిపోయారు. ఈ జీవితానికి ఇంతకు మించి ఏమీ అవసరం లేదుని, ఈ జన్మకు చచ్చిపోయినా ఫర్వాలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా బేబీని చిరంజీవి ప్రశంసలతో ముంచెత్తారు. దేవుడు మిమ్మల్ని దీవించాలన్నారు. మీరు అద్భుతమైన వ్యక్తి, అరుదైన కళ మీలో ఉంది… ఈ పరిశ్రమలో మీరు మంచి స్థానం ఏర్పరచుకోవాలి, మీరు మట్టిలో మాణిక్యం లాంటి వారు…. అంటూ చిరంజీవి బేబీపై ప్రశంసల వర్షం కురిపించారు.
తన భార్య సురేఖ వల్లే బేబీ గురించి తెలిసిందని చిరంజీవి తెలిపారు. సురేఖ మీ వీడియో ఎక్కడో చూసి నాకు చెప్పింది. మీరు పాట పాడిన వీడియో చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. మీలాంటి ప్రతిభ ఉన్న వ్యక్తులు ఈ పరిశ్రమకు ఎంతో అవసరం అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
సంగీతం నేర్చుకోలేదు, గమకాలు, స్వరాలు తెలియదు. అయినా సహజ సిద్ధంగా అవన్నీ పలకడం ఎంతో అద్భుతంగా ఉందని చిరంజీవి కితాబిచ్చారు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి టాలెంట్ దక్కదన్నారు. మీరు సహజ గాయిని అంటూ చిరంజీవి మెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో మీకు మంచి భవిష్యత్ ఉంటుంది అని చిరంజీవి భరోసా కూడా ఇచ్చారు.
చిన్నప్పటి నుంచి పాటల మీద ఆసక్తి ఉండేదని, పొలం పనులకు వెళ్లినపుడు పాట పాడుతూ పని చేసేదానన్ని బేబీ చెప్పుకొచ్చారు. మీ సినిమాలు బాగా చూసేవారమని చిరంజీవితో ఆమె అన్నారు. బేబీ ఓ సాధారణ గృహిణి. ఆమె భర్త ఆటో డ్రైవర్. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఏ పనిలో ఉన్నా.. పాటలు పాడటం ఆమెకు అలవాటు. ఏదో ఒక పాట పాడుతూ పనులన్నీ చేస్తుంటారు.

మీరు మట్టిలో మాణిక్యం: చిరంజీవి
‘ప్రేమికుడు’ సినిమాలోని ‘ఓ చెలియా.. నా ప్రియ సఖియా’ అంటూ బేబీ పాడిన పాటకి అంతా ఫిదా అయిపోయారు. రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాట మరోసారి వైరల్ అయ్యింది. అందుకు కారణం.. ఈ గ్రామీణ గాయని గాత్రమే. వడిశలేరు బేబీ గానానికి, టాలెంట్ కి నెటిజన్లు, సంగీత ప్రియులంతా మైమరచిపోతున్నారు. సెమీక్లాసికల్‌ శైలిలో ఉండే పాటను అలవోకగా పైస్థాయి రాగాలను సైతం హాయిగా, శ్రవణానంద భరితంగా, మాధుర్యంగా పాడేయడం.. నెటిజన్లకు ఓ అద్భుతంలా అనిపించింది.

ఫేస్‌బుక్‌లో రెహమాన్ పోస్టు

బేబీ ఏమీ చదువుకోలేదు. ఆమె పాట మాత్రం సినీ సంగీత దర్శకులు, గాయకులు, గాయనీమణుల ప్రశంసలు అందుకుంది. కొన్ని టీవీ చానళ్లు ఆమెను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ పాటలు పాడించాయి. బేబీ పాటను విన్న సినీ సంగీత దర్శకుడు కోటి.. బేబీ మట్టిలో మాణిక్యమని, బోల్‌ బేబీ బోల్‌ పాటల కార్యక్రమంలో పాడిస్తానంటూ హామీ ఇచ్చారు. ఇండస్ట్రీలో అవకాశాలూ ఇప్పిస్తామని పలువురు సింగర్లు హామీ కూడా ఇవ్వడం విశేషం. మొత్తంగా ఓ మారుమూల గ్రామంలో ఆమె పాడిన పాట ఇప్పుడు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తమైంది.

Tags : chiranjeevi praises singer babymegastar chiranjeevi meets singer babysinger babyvillage singer baby

Use Facebook to Comment on this PostMenu