01/25/19 9:43 PM

”మిస్టర్ మజ్ను” సినిమా రివ్యూ

Mr Majnu Telugu Movie Review

టైటిల్ : Mr మజ్ను
జానర్ : రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
నటీనటులు : అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్‌, నాగబాబు, సుబ్బరాజు, ప్రియదర్శి
మ్యూజిక్ : ఎస్‌ తమన్‌
డైరెక్టర్ : వెంకీ అట్లూరి
ప్రొడ్యూసర్ : బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌

 

అఖిల్‌ అక్కినేని, నిధి అగర్వాల్ జంటగా ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్‌ మజ్ను’.  తొలి సినిమాతోనే(అఖిల్) అక్కినేని అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన అఖిల్‌, రెండో సినిమా ‘హలో’తో కాస్త పర్వాలేదనిపించుకున్నాడు. అయితే అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో మూడో సినిమా చేశాడు. తన యాజ్‌కు తగ్గ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్స్, ప్రోమోస్, స్టిల్స్ అన్నీ ఆకట్టుకోవడంతో అక్కినేని అభిమానులు సైతం అఖిల్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటాడని ధీమా వ్యక్తం చేశారు. మరి వారి ధీమాకు తగ్గట్లు సినిమా ఉందా? అఖిల్ మిస్టర్ మజ్ను గా అలరించాడా..? ఈ లవ్‌స్టోరితో అయినా సక్సెస్‌ సాధించాడా.? తొలిప్రేమ తో సూపర్ హిట్ అందుకున్న వెంకీ.. మజ్ను తో మరో హిట్ కొట్టాడా? రివ్యూలో తెలుసుకుందాం..

 

క‌థ‌:
విక్కీ (అఖిల్) లండ‌న్ యూనివ‌ర్సిటీలో చ‌దువుకుంటుంటాడు. క‌నిపించిన ప్ర‌తీ అమ్మాయిని త‌న మాయ‌లో ప‌డేయ‌డం అతడి స్పెషాలిటీ. అలాంటి విక్కీ జీవితంలోకి అనుకోకుండా నిక్కీ(నిధి అగ‌ర్వాల్) వ‌స్తుంది. త‌న గురించి పూర్తిగా తెలుసుకున్న త‌ర్వాత కూడా విక్కీ మాయ‌లో ప‌డిపోతుంది. అత‌న్ని ప్రేమిస్తుంది. త‌ప్ప‌క నిక్కీని ప్రేమించిన‌ట్లు న‌టిస్తాడు విక్కీ. కానీ అది న‌ట‌న అని తెలిసిన త‌ర్వాత విక్కీ జీవితంలో నుంచి వెళ్లిపోతుంది నిక్కీ. ఆమె దూరమైన తర్వాత ఆమె ప్రేమను తెలుసుకుని ఆమె కోసం తిరిగి లండన్ వెళతాడు విక్కీ. అక్క‌డ్నుంచి ఏమైంది అనేది అస‌లు క‌థ‌..

 

విశ్లేష‌ణ‌:
ఇప్పటి వరకూ బ్రేకప్ ప్రేమకథల్ని చూశాం. కానీ దర్శకుడు వెంకీ అట్లూరి హార్ట్ బ్రేకింగ్ ప్రేమ కథని ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా మళ్లీ రొటీన్ ప్రేమకథనే చూపించారు. కొంతమందికి ప్రేమను తీసుకోవడమే తప్ప ప్రేమను ఇవ్వడం తెలియదు.. ఇంకొంతమందికి ప్రేమను ఇవ్వడంతో పాటు తీసుకోవడం కూడా రాదు. కాని ప్రేమను పంచే వాళ్లు దూరమైతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ‘Mr మజ్ను’ ద్వారా చూపించాడు దర్శకుడు. ‘తొలిప్రేమ’ చిత్రంలో సెన్సిబుల్ లవ్ స్టోరీ చాలా సాఫ్ట్‌గా డీల్ చేసిన దర్శకుడు ‘Mr మజ్ను’ విషయంలో కాస్త తడబడ్డాడు. ఫస్టాఫ్‌లో తన మార్క్‌ని చూపిస్తూ డీసెంట్‌గా కథను ముందుకు నడిపించిన వెంకీ అట్లూరి.. సెకండాఫ్‌లో తేలిపోయాడు.

 

‘నీతో ఉండటం ఇష్టమే.. కాని ఎప్పుడూ ఇలా ఉండాలంటే కష్టం.. ప్రేమ.. పెళ్లి అంటే ఇంకా కష్టం’.. ఈ లైన్‌తో ఇప్పటికే చాలా ప్రేమకథలు వచ్చాయి. ఆరెంజ్, పడిపడిలేచె మనసు.. ఇలా చాలా సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. దర్శకుడు వెంకీ ఇలాంటి బ్రేకప్ ప్రేమకథనే ఎంచుకున్నారు. రొమాంటిక్ ప్రేమకథకి ‘గీత గోవిందం’ లాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలనుకుని ఆ కథనే మళ్లీ చూపించారు. దీంతో ప్రేక్షకుడికి కొత్త కథను చూస్తున్నామనే ఫీల్ కలగకపోగా సెకండాఫ్‌లో వచ్చే సాగదీత సీన్లు విసుగుపుట్టించాయి. క్లైమాక్స్ ఏమవుతుందో ముందే తెలిసిపోవడంతో స్క్రీన్‌ప్లే పై గ్రిప్పింగ్ లేకపోయింది. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్‌ బాగా క్యారీ చేయగలిగాడు దర్శకుడు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో రావు రమేష్ – అఖిల్ మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశం కల్లు చెమర్చేలా చేసింది.

 

న‌టీన‌టులు:
యాక్టింగ్ పరంగా అఖిల్ బెటర్ అయ్యాడు. ఎమోష‌న‌ల్ సీన్స్ బాగా చేశాడు. డాన్సులు ఎలాగూ అదరగొట్టేస్తాడు. ఇక న‌ట‌న‌లోనూ ముందు సినిమాల‌తో పోలిస్తే ప‌ర్లేదు అనిపించాడు. నిధి అగ‌ర్వాల్ బ‌రువైన పాత్ర చేసింది కానీ దీనికి ఆమె స‌రిపోలేదేమో అనిపించింది. ప్రియ‌ద‌ర్శి బాగా న‌టించాడు. హైప‌ర్ ఆది అంత‌గా ఆక‌ట్టుకోలేదు. సెకండాఫ్ అంతా బొమ్మ కామెడీ అదిరిపోయింది. రావు ర‌మేష్, నాగ‌బాబు, సితార‌, జ‌య‌ప్ర‌కాశ్ లాంటి వాళ్లంతా ప‌ర్లేదు.

 

టెక్నిక‌ల్ టీం:
థ‌మ‌న్ మ‌రోసారి ఆక‌ట్టుకున్నాడు. అయితే తొలిప్రేమ రేంజ్‌లో మాత్రం కాదు. ఆ సినిమాను దృష్టిలో పెట్టుకుని వెళ్తే నిరాశ త‌ప్ప‌దు. పాట‌లు ప‌ర్లేదు అనిపించాయి. ఆర్ఆర్ ఓకే. ఎడిటింగ్ సెకండాఫ్ చాలా వ‌ర‌కు మైన‌స్ అయింది. స్లోగా సాగిన‌ట్లుగా అనిపించింది. జార్జ్ విలియమ్ సన్ సినిమాటోగ్రఫీతో ఆకట్టుకున్నాడు. అఖిల్, నిధి అగర్వాల్‌లను అందంగా చూపించాడు. లండన్ లొకేషన్లను బాగా చూపించారు. నవీన్ నూలి ఎడిటింగ్ ఈ సినిమాకి ప్లస్ కాలేకపోయింది. సెకండాఫ్‌లో చాలా సీన్లకు కత్తెర వేయాల్సి ఉంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు అద్బుతంగా సాగిన క‌థ సెకండాఫ్‌లో మాత్రం పూర్తిగా గాడి త‌ప్పింది. అక్క‌డి వ‌ర‌కు స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నా సెకండాఫ్ మాత్రం పూర్తిగా అల్లుకుంటూ వెళ్లిపోయిన‌ట్లుగా అనిపించింది. డైలాగ్ రైట‌ర్‌గా మాత్రం వెంకీ ఫుల్ మార్కులు వేయించుకున్నాడు. ఓవ‌రాల్‌గా అక్క‌డ‌క్క‌డ కొన్ని సీన్లు మిన‌హాయిస్తే పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాడు మిస్ట‌ర్ మ‌జ్ను.

 

ఫైనల్ పంచ్ : రొటీన్ లవ్ స్టోరీ

 

ప్లస్‌ పాయింట్స్‌ :
అఖిల్‌ నటన
సినిమాటోగ్రఫి
ఫస్ట్ హాఫ్
డాన్స్

 

మైనస్‌ పాయింట్స్‌ :
రొటీన్‌ స్టోరి
సెకండ్‌ హాఫ్

 

రేటింగ్ : 1.5/5

Tags : Akkineni Akhilmr majnu telugu majnu telugu movie ratingmr majnu telugu movie reviewnidhi agarwalvenky atluri

Also read

Use Facebook to Comment on this PostMenu