12/29/18 6:00 PM

బాలకృష్ణకి మాజీ ముఖ్యమంత్రి వార్నింగ్

Nadendla Bhaskar Rao Warns Balakrishna

దివంగత ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న మూవీ ”ఎన్టీఆర్” బయోపిక్. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో రెండు పార్టులుగా ఈ సినిమాని విడుదల చేయనున్నారు. దీనికి క్రిష్ డైరెక్టర్. కాగా ఎన్టీఆర్ సినిమా విడుదలకు ముందే వివాదానికి దారితీసింది. బాలకృష్ణకు వార్నింగ్‌ వచ్చింది. తనను నెగిటివ్‌గా చూపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు బాలయ్యను హెచ్చరించారు. ‘ఎన్టీఆర్’ చిత్రంలో ఎవరో ఒకరిని నెగిటివ్‌గా చూపించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తనను నెగిటివ్‌గా చూపిస్తారని తాను అనుకుంటున్నానని నాదెండ్ల భాస్కర్‌రావు అన్నారు.

 

బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎన్టీఆర్ చిత్ర యూనిట్‌కు నాదెండ్ల భాస్కర్‌రావు వార్నింగ్ ఇచ్చారు. తనను సినిమాలో నెగిటివ్‌గా చూపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సినిమాలో తనను నెగిటివ్‌గా చూపించే ప్రయత్నం చేస్తారని వ్యాఖ్యానించిన నాదెండ్ల భాస్కర్ రావు… ఈ అంశంపై స్పందించారు. వాళ్లకు ఎవరో ఒకరిని నెగిటివ్‌గా చూపించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి… తనను నెగిటివ్‌గా చూపిస్తారని అనుకుంటున్నానని నాదెండ్ల భాస్కర్ రావు అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై ఇప్పటికే తన పెద్ద కుమారుడు చిత్ర హీరో బాలకృష్ణకు, దర్శకుడికి నోటీసులు ఇచ్చారని తెలిపారు. తనను సినిమాలో నెగిటివ్‌గా చూపిస్తే కోర్టుకు వెళతామని అందులో పేర్కొన్నట్టు వెల్లడించారు. సెన్సార్ బోర్డుకు సైతం ఇందుకు సంబంధించి నోటీసులు ఇచ్చామని ఆయన వివరించారు. సెన్సార్ బోర్డు ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందని భావిస్తున్నానని… ముంబైలో థాక్రే బయోపిక్ విషయంలోనూ ఇదే జరిగిందని ఆయన అన్నారు.

 

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ సినీ ప్రస్థానాన్ని, మహానాయకుడు సినిమాలో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూపించబోతున్నారు. అయితే ఆయన రాజకీయ ప్రస్థానంలో నాదెండ్ల భాస్కర్ రావు ఆయనను ఏ విధంగా మోసం చేశారనే అంశాన్ని ప్రధానంగా చూపించబోతున్నట్టు వార్తలు వినిపించాయి. సినిమాలో తనను నెగిటివ్‌గా చూపించే అవకాశం ఉందని వార్తలు రావడంతో… నాదెండ్ల భాస్కర్ రావు చిత్ర యూనిట్‌కు నోటీసులు పంపించారు.

 

సినిమాలో తన పాత్రను ఎలా చిత్రీకరించారో తెలపాలని, తనను విలన్‌గా చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. దీనిపై ఇప్పటికే ఈ చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, సెన్సార్ బోర్డుకు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం తీసే సినిమాలో తనను ప్రతినాయకుడిగా చూపిస్తే సినిమా విడుదలను అడ్డుకుంటానని నాదెండ్ల భాస్కర్‌రావు అన్నారు. ‘ఎన్టీఆర్’ సినిమాలో తన పాత్రను తప్పుగా చిత్రీకరించినట్లు ఓ వ్యక్తి ద్వారా తెలిసిందని, ఈ విషయం నచ్చకే మొదటి దర్శకుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీని బెజవాడ పాపిరెడ్డి సహా 20 మందితో కలిసి తానే స్థాపించానని, ఇదే విషయాన్ని ఎన్టీఆర్ గతంలో ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పారని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ను గద్దె దించిన ఘటనకు సంబంధించి నిజానిజాలు తెలుసుకోవాలంటే తాను రాసిన పుస్తకం చదవాలని సూచించారు. సినిమాలో నిజాలు వెల్లడిస్తే ఫర్వాలేదని.. కానీ నిజాలను వక్రీకరిస్తే మాత్రం న్యాయపోరాటం చేస్తానని నాదెండ్ల భాస్కరరావు హెచ్చరించారు. మరి… నాదెండ్ల భాస్కర్ రావు అభ్యంతరాలపై చిత్ర యూనిట్ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.

Tags : director krishlegal notice to balakrishnanadendla bhaskar rao warns balakrishnantr biopic

Also read

Use Facebook to Comment on this Post



Menu