02/4/19 1:28 PM

చీరలు కట్టుకున్న మహిళలపై అత్యాచారాలు జరగడం లేదా?

Nagababu Full Support For Ladies Dressing Style

ఆడపిల్లల డ్రెస్సింగ్ అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం కొందరు ప్రముఖులు చేసిన కామెంట్స్. ఆడవాళ్లు సంప్రదాయ వస్త్రాలను ధరించాలని కొందరు చెప్పారు. ఆడవాళ్లు శరీరాన్ని పూర్తిగా కప్పిఉంచే దుస్తులను ధరించాలని సలహా కూడా ఇచ్చారు. అలాంటి వస్త్రధారణ లేకపోవడం వల్లనే అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సైతం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ హీరోయిన్లు ఎక్స్‌పోజింగ్ చేసే డ్రెస్సులు వేసుకుంటేనే అవకాశాలు వస్తాయా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపాయి. దీనిపై మెగాబ్రదర్ నాగబాబు తీవ్రంగా స్పందించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మహిళలు, హీరోయిన్ల డ్రెస్ గురించి కామెంట్ చేస్తున్నవారిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

 

”ఇటీవల కొందరు మహానుభావులు, గౌరవనీయులు ఆడవాళ్ల డ్రెస్సింగ్ గురించి మాట్లాడారు. తెలుగు సినిమాలో సంగీతంలో అత్యంత ప్రముఖుడైన ఓ మహానానుభావుడు కూడా ఆడవాళ్ల వస్త్రధారణ గురించి కామెంట్స్ చేశారు. వాళ్ళ పేర్లు చెప్పడం ఇష్టం లేదు. ప్రవచనాలు చెప్పే ఓ వ్యక్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అసలు ఆడపిల్లలు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? శరీరాన్ని పూర్తిగా కప్పిఉంచే వస్త్రాలను ధరించినవారిపై కూడా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనేది ఆడపిల్లల హక్కు.. దానిని కాదనడానికి మీరెవరు? ఆడపిల్లలు ఎప్పుడూ ఎక్కడా కూడా మగవారి డ్రెస్సింగ్ గురించి మాట్లాడలేదే. ఎప్పుడండీ మీరు మారతారు? బూజుపట్టిన సంప్రదాయాలను పట్టుకుని వేళాడుతున్నారు” అంటూ నాగబాబు అసహనాన్ని ప్రదర్శించారు.

 

”హీరోయిన్లు ఈవెంట్స్‌లో ఎక్స్‌పోజ్ చేస్తూ డ్రెస్ వేసుకోకూడదని మాట్లాడుతున్నారు. అసలు మీ దృష్టి వాళ్లపై ఎందుకు పడుతోంది. అమ్మాయిల క్లీవేజ్ కనిపిస్తోంది, బొడ్డు కనిపిస్తోంది, తొడలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు. అసలు ఆ దృష్టితో ఎందుకు చూస్తున్నారు. అలా చూసేవాళ్లే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ముందు మీ వక్రబుద్ధి మార్చుకోండి” అని నాగబాబు సలహా ఇచ్చారు.

 

నాగబాబు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు నాగబాబుని సపోర్ట్ చేస్తే మరికొందరు వ్యతిరేకించారు. డైరెక్ట్‌గా పేరు ప్రస్తావించకపోయినా సంగీతంలో అత్యంత ప్రముఖుడు అని చెప్పి ఇండైరెక్ట్‌గా ఎస్పీ బాలుని నాగబాబు టార్గెట్ చేశారని నెటిజన్లు అంటున్నారు.

Tags : exposingHEROINSkonidela naga babuladies dressing stylemega brother nagababurapessp balasubramanyamwomen dress

Also read

Use Facebook to Comment on this Post



Menu