01/9/19 12:19 PM

మరో సంచలనం : బాలయ్య పరువు తీసిన నాగబాబు

Nagabau Sensational Short Film On Balakrishna

నందమూరి హీరో బాలకృష్ణని మెగా బ్రధర్ నాగబాబు నీడలా వెంటాడుతున్నారు. సోషల్ మీడియాలో అగ్గిరాజేస్తున్నారు. వరుస వీడియోలతో బాలయ్యపై అటాక్ చేస్తున్నారు. తీవ్ర విమర్శలతో ఏకిపారేస్తున్నారు. గతంలో తన ఫ్యామిలీకి చెందిన అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌లపై బాలకృష్ణ ఆరుసార్లు కామెంట్ చేశారంటూ ఒక్కో కామెంట్‌పై నాగబాబు చాలా ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. కొన్ని రోజులుగా బాలకృష్ణను టార్గెట్ చేస్తూ వరుస వీడియోలు విడుదల చేస్తున్న నాగబాబు తాజాగా మరో స్టెప్ ముందుకేసి సంచలనం సృష్టించారు. ఈసారియ ఆయన తన క్రియేటివిటిని కూడా జోడించారు. ‘ఎర్రోడి వీరగాథ’ పేరుతో ఏకంగా షార్ట్‌ఫిల్మ్‌నే రిలీజ్ చేశారు. ఇన్‌డైరెక్ట్‌గా బాలయ్యపై తనకున్న అక్కసునంతా తీర్చుకున్నారు.

 

గతంలో సావిత్రి ఆడియో లాంచ్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాల.. కడుపైనా చేయాల’ అన్న వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఈ షార్ట్‌ఫిల్మ్‌ను విడుదల చేశారు. ఈ వీడియో మూడున్నర నిమిషాల నిడివి ఉంది. ఇందులోని ఓ వ్యక్తిని ఆడవాళ్లు పట్టుకుని కొడుతుంటారు. వారిని అడ్డుకున్న నాగబాబు ఎందుకలా కొడుతున్నారని ఆ వ్యక్తిని ప్రశ్నిస్తాడు. దానికి అతడు చెప్పిన సమాధానం విని నాగబాబు ఆశ్చర్యపోతాడు. ‘ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాల.. కడుపైనా చేయాల’ అని పెద్దలు చెప్పారని, అందుకే ముద్దు అడిగానని అతడు చెబుతాడు. దీంతో షాకైన నాగబాబు ఆడవాళ్లను పిలిచి మరీ అతడిని చితక్కొట్టిస్తాడు.

 

నాగబాబు విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలకృష్ణ ప్రతిష్ఠాత్మకంగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల నేపథ్యంలో నాగబాబు ‘ఎర్రోడి వీరగాథ’ను విడుదల చేయడం సంచలనంగా మారింది.

 

Tags : balakrishnakadupu ayina cheyallinagababunagababu counter to balakrishnanagababu vs balakrishnaVelli muddu ayina pettaliYerrodi Veeragadha Short Film

Also read

Use Facebook to Comment on this Post



Menu