06/11/19 8:24 PM

అబ్బాయ్ తరహా పాత్రలో బాబాయ్

Nandamuri Balakrishna As Police Officer

నందమూరి నటసింహం బాలకృష్ణ.. నెక్ట్స్ మూవీకి కేఎస్ రవికుమార్ డైరెక్టర్. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా టైటిల్ విషయంలో ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. తొలుత ఈ సినిమాకి ‘రూలర్’ అనే టైటిల్ ను ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్టు వార్తలొచ్చాయి. కానీ ఈ టైటిల్ విషయంలో బాలకృష్ణ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారట. దీంతో సినిమా టైటిల్ మార్చాలని డిసైడ్ అయ్యారట.

 

‘క్రాంతి’ అనే టైటిల్ వైపు బాలకృష్ణ మొగ్గుచూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు ఈ టైటిల్ ఖాయమై పోయినట్టేనని అంటున్నారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ కనిపించనున్నాడని చెబుతున్నారు. ఆయన పాత్ర .. ‘టెంపర్’ లో ఎన్టీఆర్ పాత్ర తరహాలో ఉంటుందనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కొట్టింది. తారక్ కి మంచి హిట్ ఇచ్చింది. అవినీతి పోలీస్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ అదరగొట్టాడు. ఇప్పుడు అలాంటి రోల్ లో బాబాయ్ బాలకృష్ణ కనిపించేందుకు రెడీ అవుతున్నారు. అబ్బాయిలానే తాను కూడా హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.

Tags : Jr.NTRkranthiks ravi kumarnandamuri balakrishnarulerTemper

Also read

Use Facebook to Comment on this Post



Menu