04/21/19 1:05 PM

ఇది న్యాయమేనా? నానిపై ప్రశంసలు కురిపించిన జూ.ఎన్టీఆర్

Nandamuri Fans Angry On Jr NTR

యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ చేసిన పని ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తారక్ తీరుని కొందరు మెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం కోపంగా ఉన్నారు. ఎన్టీఆర్ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. అబ్బాయ్ ఎన్టీఆర్ తన బాబాయ్ బాలకృష్ణకు కోపం తెప్పించాడని అంటున్నారు. నందమూరి ఫ్యాన్స్ ని బాధ పెట్టారని చెబుతున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ చేసిన పని ఏంటి అంటే.. నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా బాగుందని ప్రశంసిస్తూ ట్వీట్ చెయ్యడమే. నాని అద్భుతంగా నటించాడు అని ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించాడు.

 

నాని హీరోగా.. ‘మళ్ళీరావా’ ఫేం గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా ‘జెర్సీ’. క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మిడిల్‌ ఏజ్‌ క్రికెటర్‌గా కనిపించిన నానీ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ సినిమాను చూశాక జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ట్విట్టర్‌ వేదికగా నానితో పాటు జెర్సీ టీంపై ప్రశంసలు కురిపించాడు. ‘ఇదో అద్భుతమైన సినిమా. ఇలాంటి సబ్జెక్ట్‌ ఎంచుకుని.. దానిని పక్కాగా తెరకెక్కించిన గౌతం తిన్ననూరి ప్రతిభకు హాట్సాఫ్‌. అదే విధంగా గౌతం విజన్‌కు తగ్గట్లుగా నటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు’ అని ట్వీట్‌ చేశాడు. ఇక జెర్సీ మూవీలో నాని నటనకు ముగ్ధుడైన జూ.ఎన్టీఆర్‌… ‘ అద్భుతమైన ప్రదర్శనతో బాల్‌ను బౌండరీ దాటించావు. బ్రిలియంట్‌!!! చాలా రోజుల తర్వాత నీ నుంచి వచ్చిన ఇలాంటి ప్రదర్శన చూసి చాలా గర్వంగా ఫీలవుతున్నా’ అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు.

 

ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు చర్చకు దారితీసింది. ‘RRR’ షూటింగ్‌లో ఎంతో బిజీగా ఉన్నా తీరిక చేసుకొని మరీ జెర్సీ సినిమా చూశాడు ఎన్టీఆర్. అంతేకాదు ఈ సినిమా బాగుందని మెచ్చుకుంటూ నానిని ప్రశంసలతో ముంచెత్తాడు. ఎలాంటి ఈగో లేకుండా నాని సినిమాని మెచ్చుకున్నాడు. ఇది ప్రశంసించాల్సిన విషయమే. అయితే తన ఎన్టీ రామారావు జీవిత కథ ఆధారంగా బాబాయ్ బాలకృష్ణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’తో పాటు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల గురించి మాట వరసకైనా జూ.ఎన్టీఆర్ ఒక్క మాట కూడా చెప్పకపోవడం చర్చనీయాంశమైంది.

 

సంక్రాంతి కానుకగా రిలీజైన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు వచ్చాయి. స్టార్ హీరో మహేష్ బాబు సహా పలువురు హీరోలు ఈ సినిమా చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాపై స్పందించలేదు. ఒక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఏదో నామ మాత్రంగా వచ్చి వెళ్లాడని అంతా చెప్పుకున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్.. బాబాయ్ బాలకృష్ణ విషయాన్ని పక్కన పెడితే..తన తాత జీవిత చరిత్రపై తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా విషయంలో మాట వరుసకైనా ఒక్క మాట మాట్లాడని తారక్..అదే పక్క హీరోల సినిమాల విషయంలో స్పందించడంపై నందమూరి అభిమానుల్లోని ఒక వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఏమైనా ‘జెర్సీ’ సినిమా బాగుందని ఎన్టీఆర్ మెచ్చుకోవడం మంచిదే అయినా…అదే తాత ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో అప్పట్లో స్పందించి ఉంటే బాగుండేదని నందమూరి అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారట. అబ్బాయ్ తీరుతో బాబాయ్ కొంచెం హర్ట్ అయినట్టు చెప్పుకుంటున్నారు.

 

Tags : jerseyjr ntr tweetJr.NTRnandamuri balakrishnananintr kathanayakuduntr mahanayakudu

Also read

Use Facebook to Comment on this Post



Menu