10/3/19 8:50 PM

తెలుగు సినీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్ : రెడ్డి గురించి గొప్పగా చూపించారని ప్రశంసలు

New Angle In Sye Raa Narasimha Reddy

సైరా నరసింహారెడ్డి.. భారీ తారాగణం, భారీ బడ్జెట్ (రూ.300 కోట్లు) తో తెరకెక్కిన మూవీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రాంచరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ వచ్చిన సైరా సినిమా.. వాటికి తగ్గట్టుగానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో చిరంజీవి, చరణ్.. చిత్ర యూనిట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రిలీజ్‌కి ముందు ఎంత హైప్ ఉందో రిలీజ్ తర్వాత కూడా అంతే బజ్ ఉంది.

 

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సైరా సినిమా తీశారు. లీడ్ రోల్ ని చిరంజీవి పోషించారు. నరసింహారెడ్డిగా చిరంజీవి సూపర్బ్ గా యాక్ట్ చేశారనే ప్రశంసలు అందుతున్నాయి. చిరంజీవి నటన అద్భుతంగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి చక్కగా ఒదిగిపోయారని కితాబిస్తున్నారు. చిరంజీవి తన సినీ జీవితంలో గర్వంగా చెప్పుకునే చిత్రం అని అంటున్నారు.

 

ఇకపోతే సైరా సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ గా మారింది. కులం గురించి ప్రస్తావన వచ్చింది. రెడ్డి కులస్తుడి గురించి చాలా గొప్పగా చూపించారు అని ప్రశంసిస్తున్నారు. మొదటిసారి తెలుగు సినీ చరిత్రలో ”రెడ్డి” అంటే ఒక స్వాతంత్ర్య సమర యోధుడు, ఒక హీరో, ఒక యోధుడు అని చెప్పడంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి సక్సెస్ అయ్యారని నెటిజన్లు చెబుతున్నారు. ఇన్నాళ్లు ఒక కులం నీడలో సినిమా ఇండస్ట్రీ ఉండేదని.. రెడ్డి కులాన్ని టార్గెట్ చేసేదని.. రెడ్డి కులస్తులను ఫ్యాక్షనిస్టులుగా, మర్డర్లు చేసే వారిలా, విలన్లుగా చూపించారని వాపోయారు. తొలిసారి రెడ్డి గురించి, రెడ్డి వీరత్వం గురించి సైరా సినిమా ద్వారా తెలియజేశారని, ఇందుకు గాను డైరెక్టర్ సురేందర్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఒక రెడ్డి వల్లనే స్వాతంత్ర్య సంగ్రామం మొదలైందని ఇప్పటి తరానికి తెలిపేలా రెడ్ల గురించి తెలియచేసిన గొప్ప సినిమా సైరా అని అంటున్నారు. ఇంత గొప్ప సినిమా తీసినందుకు గాను.. దర్శకుడు సురేందర్ రెడ్డికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. సైరా సినిమాలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వీరత్వాన్ని అద్భుతంగా చూపించారని ప్రశంసించారు.

Tags : chiranjeeviram charanreddy castesurender reddySye raa narasimha reddy

Also read

Use Facebook to Comment on this Post



Menu