01/31/19 1:28 PM

కథానాయకుడు ఎఫెక్ట్.. వెనకడుగు వేసిన బాలయ్య

NTR Mahanayakudu Movie Release Date Delay

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా క్రిష్ దర్శకత్వంలో బయోపిక్ సినిమాను తీసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు పేరుతో మొదటి భాగాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేశారు. త్వరంలో ఎన్టీఆర్ మహానాయకుడిని విడుదల చేయనున్నారు. అయితే రెండో పార్టు రిలీజ్ విషయంలో విడుదల తేదీలో సందిగ్ధత నెలకొంది. బాలకృష్ణ కొంత వెనక్కి తగ్గారట. కొంత గ్యాప్ తీసుకుని సినిమాని రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. దీనికి కారణం ఫస్ట్ పార్ట్ రిజల్ట్ దారుణంగా ఉండటమే.

 

ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగంగా వచ్చిన ‘కథానాయకుడు’ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలమైంది. బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. లాంగ్ రన్‌లో నష్టాల బాట పట్టింది. ప్రాఫిట్ సంగతి అటుంచితే.. ఓవరాల్‌గా రూ.50 కోట్ల నష్టాలను మిగిల్చినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. దీంతో బాలయ్య ఆలోచనలో పడ్డారట. ఈ పరిస్థితుల్లో ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ విడుదలకు బ్రేకులు పడ్డాయి. ఫస్ట్ పార్ట్‌తో తీవ్రంగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ సెకండ్ పార్ట్‌ కొనే ధైర్యం చేయడం లేదట.

 

కాగా తొలిభాగం మొత్తం ఎన్టీఆర్ సినిమా జీవితంపై రూపొందించగా.. రెండో భాగాన్ని ఎన్టీఆర్ రాజకీయ జీవితంపై చిత్రీకరించారు. ఇందులో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం.. చంద్రబాబు ఎంట్రీ.. లక్ష్మీపార్వతి లాంటి అంశాలు కీలకం కానున్నాయి. వాస్తవానికి ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాన్ని తొలిభాగం విడుదలైన 5 రోజుల తర్వాత అంటే.. జనవరి 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 7 అంటూ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

 

అయితే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో విడుదల తేదీని వాయిదా వేస్తూ ఫిబ్రవరి 22కి జరిపారు. అయితే దీనిపై ఇప్పటివరకు దర్శక, నిర్మాతల నుండి ఎలాంటి అఫీషియల్ డేట్ అనౌన్స్‌మెంట్ రాకపోవడంతో ఫిబ్రవరి 22 కూడా కన్ఫామ్‌గా చెప్పలేని పరిస్థితి. దీనికి తోడు ఎన్టీఆర్ మహానాయకుడు షూటింగ్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. కీలకమైన భారీ సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉంది. బడ్జెట్ తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని అనేక బ్రేక్‌ల మధ్య ఈ షూటింగ్ నడుస్తోంది. ఇకపోతే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రానికి 2 నెలల ముందు నుండే విపరీతమైన ప్రమోషన్స్ నిర్వహించారు. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ షూటింగ్ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ప్రమోషన్స్ ఇంకా ప్రారంభమే కాలేదు. దీంతో అసలు రెండో పార్ట్ విడుదల చేస్తారా? లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 

‘కథానాయకుడు’ సినిమాను ఈ నెల 9వ తేదీ .. బుధవారం విడుదల చేశారు. ‘మహానాయకుడు’ సినిమాను మాత్రం శుక్రవారం రోజునే విడుదల చేయాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 22ను ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రెండో పార్టుతో అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని బాలయ్య పట్టుదలగా ఉన్నారట. ఈసారి మరింత జాగ్రత్తగా సినిమాను తెరకెక్కిస్తున్నారట. అయితే ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో చాలా విషయాలే జరిగాయి. ముఖ్యంగా వెన్నుపోటు రాజకీయం సంచలనంగా మారింది. మరి ఆ సీన్‌ను ఇందులో ఎలా చూపిస్తారో అనే ఆసక్తి నెలకొంది. అయితే అసలా ఆ సీన్ ప్రస్తావన ఉండకపోవచ్చనే సందేహాలూ లేకపోలేదు. వివాదాల జోలికి వెళ్లకపోవడమే సేఫ్ అని చిత్ర యూనిట్ అనుకుంటున్నారని సమాచారం.

Tags : balakrishnakrishntr kathanayakuduntr mahanayakuduntr mahanayakudu release date postponed

Also read

Use Facebook to Comment on this PostMenu