06/20/19 1:02 PM

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత : పవన్ కళ్యాణ్ న్యూ లుక్

Pawan Kalyan New Look Becomes Viral

అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఫలితాలు చూసిన జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెటప్ మారిపోయింది. నిన్నటి వరకూ గుబురు గడ్డంతో.. తెల్ల లాల్చీ, పంచెలో కనిపించిన పవన్.. తాజాగా జీన్స్, టీ షర్ట్ లోకి వచ్చేశారు. గడ్డాన్ని ట్రిమ్ చేశారు. పవన్ న్యూ లుక్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కొత్త గెటప్ అభిమానులను అలరిస్తోంది. కాగా, వెండితెరపై రీ ఎంట్రీకి తమ హీరో సిద్ధమయ్యాడని, త్వరలోనే సినిమాల్లో కనిపించడం పక్కా అని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ విషయంలో పవన్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

పవన్ ఇన్ని రోజులు లాల్చీ, పైజామాలోనే క‌నిపించారు. రాజ‌కీయ నాయ‌కుడి లుక్కులోనే దర్శనం ఇచ్చారు. రాజ‌కీయాల్లో బిజీగా ఉండి పూర్తిగా పొలిటిక‌ల్ లీడ‌ర్ అయిపోయారు. తాను ఓ హీరో అనే విష‌యాన్ని కూడా మ‌ర్చిపోయారు. అయితే ఎన్నిక‌లు అయిపోవ‌డం.. జ‌న‌సేన దారుణంగా ఓడిపోవ‌డంతో ప‌వ‌న్ నెక్ట్స్ ఏం చేస్తారా అనే ఆస‌క్తి అంద‌రిలోనూ మొద‌లైంది. ఇలాంటి సందేహాల నడుమ ఏడాది త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు పూర్తిగా లుక్ మార్చేశారు ప‌వ‌న్.

 

పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో మాస్ ఇమేజ్ తో పవర్ స్టార్ గా ఎదిగారు. అదే తరుణంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీకి, కేంద్రంలో బీజేపీకి మద్దతిచ్చిన పవన్.. ఈసారి స్వయంగా బరిలోకి దిగారు. జనసేన అభ్యర్థులను బరిలోకి దించారు. తాను స్వయంగా 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశారు. అయితే ఫలితాలు దారుణంగా వచ్చాయి. ఊహించని విధంగా జనసేన పరాజయం పాలైంది. పవన్ కళ్యాణ్ కి చేదు అనుభవం ఎదురైంది. ఫలితాలు జనసేన శ్రేణుల్లో తీవ్ర నిరాశ నింపాయి. కొంతకాలం పవన్ అందరికి దూరంగా ఉన్నారు. కాగా, ఇప్పుడు పవన్ కొత్త లుక్ చర్చకు దారి తీసింది. పవన్ తిరిగి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారా? అనే డిస్కషన్ జరుగుతోంది.

 

అదే సమయంలో.. ఈ ఫొటోపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇది ఇప్ప‌టి లుక్కేనా లేదంటే పాత లుక్ ఇప్పుడు వైర‌ల్ అవుతోందా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Tags : actionjanasenaMoviesnew lookpawan kalyanpawan new getupre entry

Also read

Use Facebook to Comment on this Post



Menu