10/16/19 8:35 PM

అదే నిజమైతే.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు పండగే

Pawan Kalyan Re Entry To Movies

పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? పవన్ మళ్లీ మేకప్ వేసుకోనున్నారా? తెరపై సందడి చేయబోతున్నారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. జనసేనాని పవన్.. రాజకీయాల్లోకి వెళ్లాక పూర్తి స్థాయిలో తన దృష్టిని పాలిటిక్స్‌పైనే పెట్టారు. పూర్తి సమయాన్ని ప్రజా జీవితంలోనే గడుపుతున్నారు. సినీ ప్రపంచానికి దాదాపుగా దూరంగానే ఉంటున్నారు. సినిమాల గురించి కనీసం ఎక్కడా మాట్లాడటం కూడా లేదు. అయినప్పటికీ పవన్ సినిమా చేయబోతున్నారంటూ అప్పుడప్పుడు వార్తలు ప్రచారమవుతూనే ఉన్నాయి. ఆ ప్రచారాలను పవన్ సైతం ఖండించారు. కానీ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. తన దృష్టిని మరోసారి సినిమాలపై కేంద్రీకరించినట్టు సమాచారం. ఆత్మీయులు సలహాల మేరకు జనసేనాని మనసు మార్చుకున్నారన్న టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది.

 

ఓ కథతో పవన్ కల్యాణ్ ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మెప్పించారనే వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. ఆ కథ పవన్ కు నచ్చిందని… క్రిష్ దర్శకత్వంలో త్వరలోనే పవన్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే నిజమైతే పవన్, క్రిష్ ల కాంబినేషన్ లో కొత్త సినిమా వస్తున్నట్టే. అయితే ఇది ఎంత వరకు నిజమనే విషయం తెలియాలంటే మాత్రం… అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

 

గతంలో మాదిరి మాస్ సినిమాలు కాకుండా.. జనాలను చైతన్య పరిచే సామాజిక సందేశం ఉన్న, రాజకీయ చైతన్యం నింపే సినిమాలు చేయాలని పవన్ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇక ఏపీలో ఎలక్షన్స్‌కు మరో ఐదేళ్లు ఉండటంతో రాజకీయాల్లో కొనసాగుతూనే.. ఈ లోగా ప్రజలను మేలుకొలుపే సినిమాలు చేయాలని పవన్ డిసైడ్ అయ్యారట. ఇప్పటికే దర్శకుడు క్రిష్.. పవన్ కు సామాజిక సందేశం ఉన్న మంచి స్టోరీ చెప్పినట్టు.. దానికి పవన్ ఓకే చెప్పినట్టు సమాచారం.

 

క్రిష్ విషయానికొస్తే.. కెరీర్ మొదటి నుంచి ‘గమ్యం’, ‘కంచె’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ఎన్టీఆర్ బయోపిక్ వంటి డిఫరెంట్ సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇందులో కొన్ని సినిమాలు కమర్షియల్‌గా ఫెయిలైనా.. దర్శకుడిగా క్రిష్ మాత్రం ఫెయిల్ కాలేదు. అందుకే.. క్రిష్ కథ చెప్పగానే.. పవన్ నో చెప్పలేకపోయారంట.

 

ఇది ఇలా ఉంటే.. మరో దర్శకుడి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పవన్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందించిన హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ రీ ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్త వైరల్ గా మారింది. ఇప్పుడు అదే కాంబో పవన్‌ రీ ఎంట్రీ ఇస్తే మరోసారి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన లూసిఫర్‌ సినిమాను తెలుగులో పవన్‌ కల్యాణ్ హీరోగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ రీమేక్‌కు హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ స్వయంగా నిర్మించనున్నాడట.

 

పవన్‌ రీ ఎంట్రీకి దర్శకుడిగా హరీష్‌ను ఎంచుకోవడానికి మరో కారణం లేకపోలేదు. గబ్బర్ సింగ్‌తో పవన్‌కు లైఫ్ టైం హిట్ ఇచ్చింది హరీషే. అంతేకాదు మెగా హీరోలతో వరుస విజయాలు సాధించిన రికార్డ్‌ హరీష్ సొంతం. పవన్‌ కళ్యాణ్‌తో గబ్బర్ సింగ్, సాయి ధరమ్‌ తేజ్‌తో సుబ్రమణ్యం ఫర్‌ సేల్, అల్లు అర్జున్‌తో డీజే దువ్వాడ జగన్నాథమ్, తాజాగా వరుణ్ తేజ్‌తో గద్దలకొండ గణేష్‌ (వాల్మీకి) సినిమాలను తెరకెక్కించాడు హరీష్. ఈ సినిమాలన్ని పర్లేదు అనిపించాయి. పవన్‌ రీ ఎంట్రీ సినిమాను కూడా హరీష్‌ డైరెక్ట్ చేస్తే సెంటిమెంట్‌ వర్క్‌ అవుట్‌ అవుతుందన్న ప్లాన్‌లో ఉందట మెగా టీం.

 

అదే సమయంలో మరో వార్త కూడా హల్ చల్ చేస్తోంది. పవన్ నటించబోయేది హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘పింక్’ రీమేక్‌లో అనేది ఫిలింనగర్ టాక్. మొదట ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేస్తాడని వార్తలు చాలా రోజులు హల్‌చల్ చేశాయి. కానీ బాలయ్య ఎందుకో ఆ రోల్ వైపు మొగ్గుచూపలేదట. తమిళనాట అజిత్ హీరోగా నేర్కొండ పార్వైగా రీమేక్ చేసారు ఈ చిత్రాన్ని. అక్కడ కూడా సంచలన విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో పవన్ హీరోగా రీమేక్ చేయబోతున్నారనే సమాచారం వినిసిస్తోంది. పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా హరీష్ శంకర్ ఈ కథను మార్చేస్తున్నట్లు టాక్. ఇలా రకరకాల డైరెక్టర్ల పేర్లు, రకరకాల సినిమాల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ దేనిపైనా క్లారిటీ లేదు, అఫీషియల్ అనౌన్స్ మెంట్. ఏది ఏమైనా పవన్‌ రీ ఎంట్రీ కోసం అభిమానులు మాత్రం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Tags : actingharish shankarjanasenakrishpawan kalyanpinkre entryremakesilver screen

Also read

Use Facebook to Comment on this PostMenu