10/30/18 11:00 AM

మనసంతా నువ్వే సినిమా పాటల రచయిత అరెస్ట్..!

tollywood lyricist kulasekhar

ఆయనో ప్రముఖ సినీ గేయ రచయిత. ఎన్నో సూపర్ హిట్ పాటలు ఆయన కలం నుంచి పుట్టాయి. కానీ ఇప్పుడు ఆ క‌లం ప‌ట్టిన చేతులకు బేడీలు పడ్డాయి. అలాంటి టాలెంటెడ్ రైటర్ ఇప్పుడు దొంగగా మారాడు. దొంగతనం కేసులో పోలీసులకు చిక్కిపోయాడు. ఒక‌ప్పుడు సంచ‌ల‌న గేయ ర‌చ‌యిత‌గా తెలుగులో అద్భుతాలు సృష్టించిన ఆయనే కుల‌శేఖ‌ర్.

 

ఓ ఆలయ పూజారి బ్యాగును దొంగిలించిన కేసులో ప్రముఖ సినీ గేయ రచయిత కులశేఖర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే లాంటి సూపర్‌హిట్ చిత్రాలకు పాటల రచయితగా పనిచేసిన కులశేఖర్ స్వస్థలం సింహాచలం. తిరుమల పల్లెర్లమూడి కులశేఖర్‌(47) హైదరాబాద్‌ మోతీనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. మూడు రోజుల కిందట ఆర్బీఐ క్వార్టర్స్‌ సమీపంలో మాతా దేవాలయం పూజారి బ్యాగు దొంగిలించాడు. ఆదివారం శ్రీనగర్‌ కాలనీలోని ఓ ఆలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతడిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కులశేఖర్ నుంచి రూ.50వేల విలువైన 10 మొబైల్స్, రూ.45వేల విలువచేసే బ్యాగులు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, తాళంచెవులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

 

వందకు పైగా సినిమాలకు పాటల రచయితగా పనిచేసిన కులశేఖర్‌, చెడు వ్యసనాలకు బానిసై కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు. కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉన్నాడు. కుల‌శేఖ‌ర్ ఇలా పోలీసుల‌కు దొరికిపోవ‌డం ఇదే తొలిసారి మాత్రం కాదు. రెండేళ్ల కిందట కాకినాడలోని ఆంజనేయస్వామి గుడిలో శఠగోపం చోరీ చేశాడు. ఆ కేసుకు సంబంధించి రాజమండ్రి జైలులో ఆరు నెలలపాటు శిక్షను అనుభవించాడు. ఓ సినిమాలో కులశేఖర్‌ రాసిన పాట పూజారులను కించపరిచేలా ఉందని ఆ సామాజికవర్గం అతన్ని వెలివేసింది. దీంతో బ్రాహ్మణులపై ద్వేషం పెంచుకున్న కులశేఖర్‌, పూజారులను, ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

 

కాకినాడలోని శ్రీబాలాత్రిపుర సుందరి ఆలయానికి 2013 అక్టోబరు 24న వెళ్లిన కులశేఖర్‌, ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారి శఠ గోపరాన్ని అపహరించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. కులశేఖర్‌ దొంగతనం చేసినట్టు నిర్ధరణ కావడంతో కాకినాడ అయిదో జేఎఫ్సీ జడ్జి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చారు.

 

ఏమ‌న్నా మార‌దు ఈ ప్రేమ‌..

అయ్య‌య్య‌య్యో అయ్య‌య్యో చ‌లికాలం చంపేస్తుంద‌య్యో..

చెలియా చెలియా చెలియా.. నా గుండెలో నీవుండిపోవా..

గాజువాక పిల్లా మేం గాజులోల్లం కాదా..

ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటలను కులశేఖర్ రాశాడు.

 

కాగా, కులశేఖర్ మ‌తిస్థిమితం బాగోద‌ని.. కొన్నేళ్లుగా ఆయ‌న ఆరోగ్యం కూడా బాగోలేద‌ని.. ఏం చేస్తున్నాడో ఆయ‌న‌కు కూడా తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఉన్నాడని సన్నిహితులు చెబుతున్నారు. ఈయ‌న ప‌రిస్థితి చూసి పాపం అంటూ కొంద‌రు జాలి పడుతుంటే మ‌రికొంద‌రు మాత్రం చేజేతులా చేసుకున్నాడని అంటున్నారు.

ఇప్పుడు క‌లం ప‌ట్టిన చేతుల‌నే బేడీలు ప‌ట్టుకున్నాయి. అప్పుడు క‌లంతో అద్భుత‌మైన పాట‌లు రాసిన ఆయ‌నే.. ఇప్పుడు చోరీలు చేస్తున్నాడు. ఒక‌ప్పుడు సంచ‌ల‌న గేయ ర‌చ‌యిత‌గా తెలుగులో అద్భుతాలు సృష్టించిన కుల‌శేఖ‌ర్ ఇప్పుడు దొంగ‌గా పోలీసుల ముందు నిల‌బ‌డ్డాడు. Lyric Writer Kulasekhar in Police Remand In theft case.. lyricist kulasekhar arrested,kulasekhar,lyric writer kulasekhar,telugu cinama,తెలుగు సినిమా,రైటర్ కులశేఖర్,లిరిక్ రైటర్ కులశేఖర్ అరెస్ట్,దొంగతనం చేసిన కులశేఖర్,పూజారులను టార్గెట్ చేసిన కులశేఖర్

 

Tags : hyderabadLyricist kulasekharmotinagarpolice arrest lyricist kulasekharrobbery casetarget priests

Also read

Use Facebook to Comment on this PostMenu