06/13/18 7:39 PM

పోలీసుల మధ్య ఇరుక్కుపోయిన స్టార్ హీరో..!

Untitled-1 copy

కృష్ణజింకల వేట కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ని హత్య చేయడానికి కొంతమంది గ్యాంగ్ స్టర్స్ స్కెచ్ వేసినట్లు తెలియడంతో ముంబై పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ కి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

 

ఆ మ‌ధ్య రేస్-3 చిత్ర షూటింగ్ స‌మ‌యంలో కొంద‌రు వ్య‌క్తులు అనుమానాస్పదంగా క‌నిపించ‌టంతో వెంట‌నే పోలీసులకి స‌మాచార‌మిచ్చి షూటింగ్‌ కి బ్రేక్ ఇచ్చాడు స‌ల్మాన్‌. ప్ర‌స్తుతం ఈ బాలీవుడ్ స్టార్‌ కి భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేశార‌ట ముంబై పోలీసులు. అంతేకాదు స‌ల్మాన్‌ ని చంపేందుకు హరియాణాకు చెందిన షార్ప్‌ షూటర్‌ సంపత్‌ నెహ్రా ప‌క్కా ప‌థ‌కం వేసాడ‌ని పోలీసులు విచారణలో తేలింది.

 

అయితే ఇదే గ్యాంగ్ లో ప్రమాదకరమైన మరో ముగ్గురు మనుషులు బయట ఉండటంతో…వారి నుండి ప్రాణహాని ఉండటంతో కండలవీరుడి ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా భద్రతను కూడా ఇచ్చారు. త్వరలోనే ఆ ముగ్గురిని కూడా పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.

Tags : gangster nehramumbaiplanning to kill salmanracerace 3rajasthansalman khansecurityThreat

Also read

Use Facebook to Comment on this PostMenu