01/14/18 6:40 PM

ఆ ఆరోపణలను కొట్టిపారేసిన నిర్మాత..!

Untitled-1 copy

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు, సినీ క్రిటిక్ కత్తి మహేశ్ మధ్య కొన్ని నెలలుగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఏ పని చేసినా.. కత్తి మహేశ్ వెంటనే దానిపై స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఈ గోల మరీ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ కూడా తీవ్రంగానే రియాక్ట్ అవుతున్నారు. కాగా, వాళ్లూ వీళ్లూ కాకుండా. స్వయంగా పవన్ కల్యాణ్ స్పందించాలని కత్తి మహేశ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కత్తి మహేశ్ వెనుక ఎవరో ఉన్నారని, పవన్ వెనుక కుట్ర జరుగుతోందని, కత్తి మహేశ్ ను పవన్ పైకి ఎగదోస్తున్నారని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. కత్తి మహేశ్ వెనుక ఉన్నది ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అనే ఆరోపణలూ వినిపించాయి.

 

ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, కత్తి మహేశ్ వెనుక తాను ఉన్నానని కొందరు ఆరోపణలు చేస్తున్నారని, అదంతా అవాస్తమని ఆయన తేల్చి చెప్పారు. కత్తి మహేశ్ వెనుక తానుండి చేయించాల్సిన అవసరం తనకు లేదని, అసలు, ఇది తనకు సంబంధం లేని వ్యవహారమని స్పష్టం చేశారు. కత్తి మహేశ్ తమ ఆఫీసులో కూర్చుంటూ ఉంటాడని, ఈ నేపథ్యంలో తనపై ఇటువంటి వదంతులు వచ్చి ఉంటాయని తాను భావిస్తున్నానని వివరించారు.

Tags : Kathi Maheshpawan kalyanproducerTammareddy Bharadwaja

Also read

Use Facebook to Comment on this Post



Menu