12/16/18 10:17 PM

నయా స్టార్ వెంటపడుతున్న ఒకప్పటి స్టార్ డైరెక్టర్

Puri Jagannadh To Direct Vijay Devarakonda

విజయ్ దేవరకొండ. టాలీవుడ్‌లో సెన్సేషనల్ హీరో. ప్రస్తుతం ఫుల్ క్రేజ్ ఉన్న నటుడు. రెండు మూడు సినిమాలతోనే స్టార్ డమ్ కైవసం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో ఒక్కసారిగా విజయ్ పాపులారిట ీపెరిగిపోయింది. ఈ నయా స్టార్‌ ప్రస్తుతం టాలీవుడ్ దర్శకులకు మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు. విజయ్ కోసం ఓ కథ రాస్తానని స్టార్ డెరెక్టర్ కొరటాల శివ స్వయంగా చెప్పారు. విజయ్ దర్శకుల జాబితాలో ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ (ఒకప్పటి) కూడా చేరారు. ఆయనే పూరి జగన్నాథ్.

 

కొన్నాళ్లుగా హిట్ అన్న పదానికే మొహం వాచిపోయిన దర్శకుడు పూరి జగన్నాధ్. ఈ మధ్య కాలంలో ఏ సినిమా తీసినా అట్టర్ ఫ్లాపే. దీంతో తన ఫేట్ మార్చుకునే పనిలో పడ్డాడు పూరి. ఇందుకోసం ప్రస్తుతం యమ క్రేజ్ మీదున్న విజయ్ దేవరకొండని ఎంచుకున్నాడట. విజయ్‌తో పూరి సినిమా చేయబోతున్నాడనే న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో వైరల్ అయింది. విజయ్ ప్రస్తుతం కాకినాడలో డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. అక్కడికి వెళ్లి మరీ విజయ్‌కి‌ పూరి కథ వినిపించాడనే టాక్ నడుస్తోంది. పూరి స్టోరీకి విజయ్ ప్లాట్ అయ్యాడని, ఓకే చెప్పేస్తాడని సమాచారం. పూరి జగన్నాథ్ తన సినిమాల్లో హీరోని విలక్షణంగా, పవర్ ఫుల్‌గా చూపిస్తాడు. దీంతో తొందరగానే పూరికి విజయ్ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. అయితే అసలే ప్లాప్స్‌తో ఉన్న డైరెక్టర్‌తో సినిమానా? అని విజయ్ ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు.

 

విజయ్ కంటే ముందుగా పూరి జగన్నాథ్.. హీరో రామ్‌తో ఓ చిత్రం చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. హీరో రామ్ నటించిన చివరి చిత్రం హలో గురు ప్రేమ కోసమే పరవాలేదనిపించింది. కానీ ‘నేను శైలజ’ తర్వాత ఆ స్థాయి హిట్ కోసం రామ్ ప్రయత్నిస్తున్నాడు.

 

ఇటీవలి కాలంలో పూరి జగన్నాథ్‌కు సరైన హిట్ లేదనేది నిజమే. అయితే పూరి స్టామినాని తక్కువగా అంచనా వేయలేము అని ఆయన ట్రాక్ రికార్డు చూస్తే తెలుస్తుంది. బద్రి, ఇడియట్, పోకిరి చిత్రాలకు ముందు కూడా ఎలాంటి అంచనాలు లేవు. కానీ పూరి తన మార్క్‌తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించాడు. మరి రామ్, విజయ్ దేవరకొండ చిత్రాలతో ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి.

Tags : dear comradePuri JagannadhStar directorTo Direct Vijay Devarakonda

Also read

Use Facebook to Comment on this Post



Menu