07/20/18 4:37 PM

లవర్ మూవీ రివ్యూ!

lover review

‘లవర్’ మూవీ రివ్యూ

సినిమా : లవర్‌
నటీనటులు : రాజ్‌ తరుణ్‌, రిద్ధి కుమార్‌, రాజీవ్ కనకాల, శరత్‌ కేడ్కర్‌, అజయ్‌

సంగీతం : సాయి కార్తీక్‌, అంకిత్‌ తివారి, అర్కో ప్రావో ముఖర్జీ, రిషీ రిచ్‌, అజయ్‌ వాస్‌, తనిష్క్ బాగ్చీ, జేబీ

సినిమాటోగ్రఫీః సమీర్ రెడ్డి

దర్శకత్వం : అనీష్‌ కృష్ణ

బ్యానర్ః శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్‌

నిర్మాత : హర్షిత్ రెడ్డి

 

 

కథ:

 రాజ్‌( రాజ్‌ తరుణ్) కస్ట్‌మైజ్‌డ్‌ బైక్ డిజైనర్‌.  చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన రాజ్  తన అన్నయ్య జగ్గుతో ( రాజీవ్ కనకాల)  కలిసి నివశిస్తుంటాడు.  ఓ చిన్న వీధి గొడవలో గాయం కావడంతో స్థానికంగా ఉన్న హాస్పిటల్‌లో జాయిన్ అయిన రాజ్ అక్కడ నర్సుగా పని చేస్తున్న మలయాళీ అమ్మాయి చరిత( రిద్ది కుమార్‌) తో ప్రేమలో పడతాడు. తొలత అతనిని పట్టించుకోని  చరిత ఓ సంఘటన కారణంగా అతడితో ప్రేమలో పడుతుంది. మరో వైపు చరిత హాస్సిటల్‌లో చేరిన లక్ష్మీ అనే చిన్నారితో అనుబంధం పెంచుకుంటుంది. హాస్పిటల్‌ లో ఏ చిన్న తప్పు జరిగినా ధైర్యంగా నిలదీసే చరిత,  లక్ష్మిని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణం మీదకు తెచ్చుకుంటుంది.  ఈ క్రమంలోనే ఓ మాఫియా గ్యాంగ్ హీరో అన్నయ్య జగ్గును (రాజీవ్ కనకాల) చంపేసి చరితను కిడ్నాప్ చేస్తుంది. ఇంతకీ  చరిత కాపాడాలనుకున్న లక్ష్మీ ఎవరు..? ప్రభుత్వాన్నే వణికించే  వరదరాజులు (శరత్‌ కేడ్కర్‌)కు లక్ష్మీని ఎందుకు టార్గెట్ చేస్తాడు..? లక్ష్మీ, చరితలను రాజు  ఎలా కాపాడాడు..? అన్నది మిగిలిన స్టోరీ.

ఫెర్మారెన్స్‌స్‌ః

రాజ్ తరుణ్ ఈ చిత్రంలో పోనీ టైయిల్‌తో స్టయిలిష్‌గా కనిపించాడు..ఎప్పటిలాగే తన దైన మాడ్యులేషన్‌తో, హావభావాలతో అతడు నటించాడు. తొలి హాఫ్‌లో లవర్ బాయ్‌గా, సెకండ్ హాప్‌లో మాస్ హీరోగా అతడిని దర్శకుడు ప్రొజెక్ట్ చేశాడు. రెండు పార్శాలతో కూడిన తన పాత్రకు అతడు పూర్తి న్యాయం చేశాడు. ఇక మళయాళీ నర్స్ పాత్రలో  రిద్ది కుమార్ ఆకట్టుకుంది. కేవలం గ్లామరస్‌గా కనిపించడమే కాకుండా  నటనాపరంగా కూడా ఆమె మెప్పించింది. చాలా కాలం తర్వాత రాజీవ్ కనకాలకు ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. హీరో అన్నయ్యగా చాలా ఇంటెన్స్ ఎమోషనల్ ఫెర్‌ఫార్మెన్స్‌ను రాజీవ్ కనకాల ప్రదర్శించాడు. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటించిన శరద్ కేడ్కర్‌ కు ఈ సినిమాలో పెద్ద స్కోప్ లభించలేదు. ఈ సినిమాలో అతడు కనిపించింది కేవలం మూడు-నాలుగు సీన్లలో మాత్రమే! ఇక హీరో ఫ్రెండ్స్ బ్యాచ్‌గా సత్యం రాజేష్‌, సత్య, ప్రవీణ్ తదితరులు తమ తమ పరిధి మేరకు నటించారు

ఎనాలిసిస్‌:

‘అలా ఎలా’ లాంటి హిట్ సినిమా తర్వాత దర్శకుడు అనీష్ కృష్ణ చాలా గ్యాప్ తీసుకుని రూపొందిన చిత్రమిది. అయితే తన రెండో సినిమాకు అతడు రొటీన్ కథను ఎంచుకున్నాడు. ఫస్ట్ హాఫ్ ను రాజ్ , చరితను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించే సన్నివేశాలతో .. హీరో తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో్ చేసిన అల్లరి సన్నివేశాలతో దర్శకుడు అనీష్‌ నింపేశాడు. అయితే ఈ లవ్‌ ట్రాక్‌, కామెడీ ట్రాక్ కూడా ఆకట్టుకునేలా అతడు తీయలేకపోయాడు.  అయితే ఫస్ట్‌ హాప్ లో వచ్చిన ‘నాలో ఏదో చిలిపి కలా.. అంతే కదా మరి’ సాంగ్స్ చాలా బాగున్నాయి.  ఓ యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా ఫస్ట్ హాఫ్‌ ను గంటలో ముగించాడు దర్శకుడు. ఆ తర్వాత సెకండాఫ్‌ ఆసక్తికరంగా తీయడంలో దర్శకుడు కొంతమేర సఫలీకృతుడయ్యాడనే చెప్పాలి. సినిమా రెండో అర్థభాగంలో కేరళ లో జరిగే ఎపిసోడ్స్‌ ను ఆకట్టుకునేలా అనీష్‌ కృష్ణ  తీశాడు. ఇంటెర్వల్ తర్వాత నుంచి   ప్రీ క్లైమాక్స్ వరకు సినిమాను రసవత్తరంగా తీసిన దర్శకుడు  క్లైమాక్స్ ను రొటీన్ గా  తీయకుండా  ఓ డిఫెరెంట్‌ కాన్సెప్ట్‌ తో హీరో విలన్లకు చెక్ పెట్టినట్లు చూపించాడు.( కార్ హ్యాకింగ్ లాంటి కొత్త విషయాలు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి! మొత్తంగా చెప్పాలంటే సెకండాఫ్ ఈ సినిమాకు మేజర్ ఎస్సెట్‌. అయితే రొటీన్ భారీ  క్లైమాక్స్ లకు అలవాటు పడ్డ తెలుగు జానాలకు ఈ డిఫెరెంట్ క్లైమాక్స్ ఎంత వరకు ఎక్కుతుందో చెప్పలేం!

 

ప్లస్ పాయింట్స్‌

సెకండ్ హాఫ్‌
పాటలు
సినిమాటోగ్రఫీ
హీరో హీరోయిన్ల ఫెర్‌ఫార్మెన్స్‌

మైనస్ పాయింట్స్‌ః

రొటీన్‌  కథ
వీక్‌  ఫస్ట్‌ హాఫ్‌

ఫైనల్‌  పంచ్ లైన్ః రొటీన్ లవ్ స్టోరీ

రేటింగ్‌:2.75/5

Tags : Anish krishnaLover movie reviewRaj tharuns lover movie reviewTollywood

Also read

Use Facebook to Comment on this PostMenu