12/1/18 10:19 PM
2.ఓ.. రెండు రోజుల కలెక్షన్లు..

భారత సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం 2.O. సూపర్ స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా మంచి ఆదరణను దక్కించుకుని భారీ కలెక్షన్లు రాబడుతోంది. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్లు కొంత తగ్గినా.. వీకెండ్లో కలెక్షన్లు జోరందుకొనే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. 2.O మూవీ ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.145.63 కోట్లు సంపాదించింది. వీకెండ్ పూర్తయ్యే సరికి 200 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తమిళనాడులో తొలి రోజే 2.O మూవీ వసూళ్ల పరంగా సత్తా చాటింది. ఫస్ట్ డే రూ.18.2 కోట్లు సాధించింది. ఇక ఈ సినిమా రెండో రోజుల కలెక్షన్లు రూ.27 కోట్లకు చేరుకుంటాయని, వారాంతానికి రూ.50 కోట్లు దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. తమిళంలో కంటే తెలుగు రాష్ట్రాల్లో 2.O మూవీ దూసుకెళ్తున్నది. రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.30 కోట్లు సాధించింది. వీకెండ్లో సినిమా హాల్స్ హౌస్పుల్తో నడుస్తున్నట్టు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదే ఊపు కొనసాగితే మరో రెండు రోజుల్లో రూ.50 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందంటున్నారు. కాగా, ఓవర్సీస్ మార్కెట్లో రజనీ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. వర్కింగ్ డే కావడం వల్ల అంతగా క్రేజ్ కనిపించలేదు. గత రెండు రోజుల్లో సుమారు. 33 కోట్లు వసూలు చేసింది.
ఉత్తరాదిలో 2.O మూవీ కలెక్షన్లు ఊహించినంతగా లేవని ట్రేడ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాకపోతే ఆశాజనకంగాను ఉన్నట్టు వసూళ్లు వెల్లడిస్తున్నాయి. గత రెండు రోజుల్లో రూ.38 కోట్లు వసూలు చేసింది. దాంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.112.63 కోట్లు వసూలు చేసినట్టయింది.
ఇక మొదటిరోజు దేశవ్యాప్తంగా 110 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 21.5 కోట్లు వసూలు చేసిందని పంపిణీదారులు ఎన్.వి.ప్రసాద్, దిల్ రాజు తెలిపారు.
Tags : 2.o movie collectionsAkshay kumarday 2rajinikanthshankarworld wide box office collections