08/12/19 1:04 PM
రకుల్-ఝాన్సీ ఘాటు ముద్దు : సింగర్ చిన్మయిపై తీవ్ర విమర్శలు

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున.. రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘మన్మథుడు 2’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. మన్మథుడు హిట్ కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కట్ చేస్తే సినిమా తుస్సు మంది. సినిమా వరస్ట్ గా ఉందనే టాక్ వచ్చింది. అసలు అది సినిమానే కాదనే విమర్శలూ వచ్చాయి. ఈ మూవీలో కథే లేదన్నారు. దీనికి తోడు ఈ సినిమాలో కొన్ని సీన్లు, డైలాగులు వివాదానికి దారితీశాయి.
ఈ చిత్రంలో కథ డిమాండ్ చేయడంతో నాగార్జునకు అక్కగా నటించిన ఝాన్సీకి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్తో ఓ రొమాంటిక్ సీన్ ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ ఓ సన్నివేశంలో భాగంగా రొమాంటిక్ మూడ్లో వెళ్లి ఝాన్సీని దగ్గరికి లాక్కుని ఘాటైన ముద్దు కోసం లిప్ లాక్ చేస్తుంది. మూవీలోని ఈ సీన్ తెగ వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. సినిమాకి వెళ్లిన వారు ఈ సీన్ ని తమ మొబైల్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇద్దరు ఆడవాళ్లు ముద్దుపెట్టుకోవడం ఏంటని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. సినిమాలో లెస్బియన్ సీన్లు పెట్టారని కామెంట్స్ చేశారు.
అదే సమయంలో ఈ కిస్ సీన్ ని అడ్డం పెట్టుకుని సింగర్ చిన్మయిని నెటిజన్లు ఆడుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. ‘మన్మథుడు 2’ చిత్రానికి దర్శకత్వం వహించింది చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్. మాట్లాడితే హక్కులు, రెస్పాన్సిబిలిటీ అంటూ సోషల్ మీడియాలో నీతులు చెప్పే చిన్మయికి ఇలాంటి సీన్లు కనిపించడం లేదా? ఇద్దరు మహిళలు ముద్దు పెట్టుకోవడం మన సాంప్రదాయమా? మందు కొట్టడం, సిగరెట్ తాగడం, షర్ట్ బటన్స్ విప్పడం లాంటి సన్నివేశాలతో పాటు F***తో మొదలయ్యే బూతులు మీ ఆయన తీసిన సినిమాలో చాలా ఉన్నాయట.. సందీప్ వంగా లాంటి దర్శకుడు తీస్తే బూతులు, మీ ఆయన చూస్తే నీతులా? అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో చిన్నయిపై మండిపడుతున్నారు. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. హీరోయిన్ను హీరోనే ముద్దు పెట్టుకోవాలా? ఇద్దు ఆడోళ్లు పెట్టుకుంటే తప్పా? మేల్ డామినేషన్ తగ్గాలి…. అంటూ సింగర్ చిన్మయిని ఈ ఇష్యూలోకి లాగి కామెంట్స్ చేస్తున్నారు.
దర్శకుడు ఏ ఉద్దేశంతో ఇలాంటి సీన్లు, డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టాడో కానీ.. ఏది కూడా వర్కవుట్ అవ్వలేదు. నాగ్ కెరీర్ లో పెద్ద డిజాస్టర్ గా ఈ సినిమా నిలిచిపోతుందని అంటున్నారు. మన్మథుడు సినిమా ఎంత బాగా తీశారో.. మన్మథుడు-2ని అంత దరిద్రంగా తీశారని ఫ్యాన్స్ అంటున్నారు. ఆఖరికి నాగ్ ని అభిమానించే వారికి కూడా మన్మథుడు-2 సినిమా నచ్చలేదంటే.. మూవీ ఎంట వరస్ట్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
— KalyanFanatic (@gowrav_pk) August 9, 2019
Tags : jhansiLip kisslip lockmanmadhudu 2nagarjunarahul ravindranrakul preet singhsinger chinmayi sripada